Ritika Singh: హీరోయిన్ కి గాయాలు , చూసుకోవాలి కదా బంగారం

కొన్ని సినిమాలు హిట్ అయినా కూడా ఆ హీరోయిన్లకు అంత త్వరగా పేరు రాదు. కానీ కొన్ని సినిమాలు తో మాత్రం హీరోయిన్ లకి అద్భుతమైన పేరు మంచి గుర్తింపు లభిస్తుంది. గురు సినిమాలో వెంకటేష్ తో పాటు రామేశ్వరి క్యారెక్టర్ లో నటించింది రితికా సింగ్. ఆ సినిమాలో రామేశ్వరి పర్ఫామెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. బాక్సర్ గా తన ప్రతాపాన్ని చూపించి ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకుంది . స్వతహాగా ఆమె నిజంగా బాక్స్ రావడం కూడా ఆ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. ఆ సినిమా వెంకటేష్ కెరియర్ లో మంచి హిట్ అని చెప్పొచ్చు.

సుధా కొంగర కి కూడా గురు సినిమా మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఇకపోతే ఆ సినిమా తర్వాత రితిక సింగ్ కొన్ని సినిమాలు చేసినా కూడా అవి సరైన పేరును తీసుకురాలేకపోయాయి. ప్రస్తుతం రితిక సింగ్ రజినీకాంత్ నటిస్తున్న 170 సినిమాలో నటిస్తుంది. తన సినిమా అప్డేట్లు పక్కన పెడితే ఎప్పటికప్పుడు బాక్సింగ్ వీడియోస్ తో తన అందాలతో ఇంస్టాగ్రామ్ ని నింపుతుంది రితికా సింగ్.

అయితే ప్రస్తుతం ఈమె షూటింగ్లో గాయపడినట్లు సోషల్ మీడియా వేదిక ఇంస్టాగ్రామ్ ద్వారా రివిల్ చేసింది. చిత్ర షూటింగ్ సమయంలో తగిలిన చేతి గాయం తగిలిన ఫోటోను స్టోరీ లో పెట్టింది. దీనితో పాటు వీడియో రూపంలో ఏమి జరిగిందో చెప్పుకొచ్చింది. యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించి చిత్ర బృందం ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ, అనుకోని ప్రమాదం సంభవించింది, రితికా వెంటనే వైద్య సంరక్షణను కోరింది. ప్రస్తుతం, TJ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన రజనీకాంత్ 170వ సినిమా చిత్రీకరణలో రితికా పాల్గొంటుంది.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు