PVP : పవన్ పై సెటైర్ వేయడానికి బ్రహ్మానందాన్ని లాగుతారా ? ఇవెక్కడి చీప్ పాలిటిక్స్ పీవీపీ ?

ప్రముఖ నిర్మాత పీవీపీ సీనియర్ హాస్యనటుడు బ్రహ్మానందాన్ని లాగుతూ తాజాగా చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ వివాదాస్పదంగా మారింది. చీప్ పాలిటిక్స్ అంటూ నెటిజన్లు ఆయనపై మండి పడుతున్నారు.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పీవీపీ సినిమాస్ బ్యానర్ పై ఎన్నో సినిమాలను తెరకెక్కించిన నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. తెలుగులో బ్రహ్మోత్సవం , రాజుగారి గది, సైజ్ జీరో, బలుపు లాంటి సినిమాలను నిర్మించిన ఈ ప్రొడ్యూసర్ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. గత ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పీవీపీ ఓటమి పాలయ్యారు.

ఆ తర్వాత పీవీపీ వైసిపికి దూరంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన పోస్ట్ వివాదానికి దారి తీసింది. “వాపుకి బలుపుకి తేడా తెలుసుకోకపోతే, బాహుబలిని, బ్రహ్మానందాన్ని, జననేతను జోకర్ ను చేస్తారు ఓటర్ మహాశయులు… సర్వేజనా సుఖినోభవంతు” అంటూ పోస్ట్ చేశారు. పీవీపీ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

- Advertisement -

పీవీపీ ఏ పోస్టులో ఎవరి పేరునూ డైరెక్ట్ గా ప్రస్తావించక పోయినా, నెటిజన్లు మాత్రం ఆయన మాటల వెనకున్న రాజకీయ నాయకులు వీల్లేనంటూ పలువురు పొలిటికల్ లీడర్స్ పేర్లను అనువదించుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం సినిమా ఇండస్ట్రీకి చెందినవాడు. సినిమా వేరు, పాలిటిక్స్ వేరు. ఏదైనా రాజకీయాల గురించి ప్రస్తావన వచ్చినప్పటికీ బ్రహ్మానందం సరదాగా, సాఫ్ట్ వేలో సమాధానం ఇచ్చి పక్కకు తప్పుకుంటారు తప్ప ఎవరినీ కించపరచరు. అలాంటి బ్రహ్మానందాన్ని ఇలా చీప్ పాలిటిక్స్ కోసం వాడుకోవడం కరెక్ట్ కాదంటూ పివిపికి బుద్ధి చెబుతున్నారు.

ఉదాహరణ కోసం ఇంత గౌరవప్రదమైన బ్రహ్మానందం లాంటి దిగ్గజ నటుడి పేరుని వాడుకోవడం అదే పరిశ్రమలో ఉన్న మీకు ఎంతవరకు సమంజసంగా అనిపిస్తోంది అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా బ్రహ్మానందం కంటే బాహుబలి గొప్పోడా? ఆయన ఒక మహానటుడు బహుముఖ, ప్రజ్ఞాశాలి… ఇలా ఏదో ప్రాస కోసం ఒక మహానుభావుడిని కించపరచడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా పివిపి ఈ పోస్ట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసినదేనని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

పవన్ పై సెటైర్ వెయ్యడానికి బ్రహ్మానందాన్ని లాగుతారా? ఇదెక్కడి చీప్ పాలిటిక్స్ పివిపి? అని ప్రశ్నిస్తున్నారు. పొలిటికల్ గా ఎవరినైనా కామెంట్ చేయాలి అనుకుంటే, డైరెక్ట్ గా కడిగేయాలి కానీ ఇలా అడ్డదారుల్లో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని వాడుకోవడం కరెక్ట్ కాదని, ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేయడం కన్నా ఇంట్లో కూర్చోవడం మేలని ఫైర్ అవుతున్నారు. దీంతో ఆయన చేసిన పోస్ట్ ఆయనకే తిప్పి కొట్టినట్టు అయ్యింది.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు