Ban on Annapoorani: నయన్ మూవీపై వివాదం… బ్యాన్ చేయాలంటూ హిందూవాదుల డిమాండ్

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార 75వ సినిమా ‘అన్నపూరణి’ తాజాగా విడుదలైంది. ‘ది గాడెస్ ఆఫ్ ఫుడ్’ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమాలో జై, సత్యరాజ్, కేఎస్ రవికుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నికిలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలోకి వచ్చింది. కానీ ఈ చిత్రం కేవలం తమిళంలో మాత్రమే విడుదలైంది. జీ స్టూడియోస్, నాట్ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ వివాదంలో చిక్కుకుంది.

ఈ చిత్రంలో నయనతార బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయిగా నటించింది. సినిమాలో నయన్ భారతదేశపు అత్యుత్తమ చెఫ్ కావాలని కోరుకుంటుంది. కానీ ఆమె తండ్రి మాత్రం పద్ధతులు, కట్టుబాట్లు, సమాజం అంటూ ఆమె ఆశపై వ్యతిరేకతను కనబరుస్తాడు. తండ్రి ఇష్టం లేకపోయినప్పటికీ ఉన్నప్పటికీ ఆ బాహ్మణ అమ్మాయి భారతదేశపు ఉత్తమ చెఫ్‌గా ఎలా ఎదిగింది? ఆ తర్వాత ఆ రంగంలో ఆమెకు ఎదురయ్యే ఛాలెంజ్ ఏమిటి? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది

సాధారణంగా నయనతార సినిమా విడుదల సమయంలో ఎలాంటి ప్రమోషన్స్ చేయదు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో సినిమా బ్రాహ్మణ కుటుంబాన్ని అవమానించేలా ఉందంటూ రాష్ట్రీయ హిందూ మహా సభ రాష్ట్ర అధ్యక్షుడు వేలు ఫైర్ అయ్యారు. సినిమాను బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. వేలు మాట్లాడుతూ బ్రాహ్మణ సమాజాన్ని అవమానించేలా ఈ మూవీ ఉందని, సినిమాలో ముస్లిం యువకుడు బ్రాహ్మణ యువతితో ప్రేమలో పడినట్లు చూపించారని విమర్శించారు. సినిమా నిర్మాతలపై సివిల్ కేసు పెట్టడమే కాకుండా థియేటర్లలో ఈ మూవీని వేయకుండా అడ్డుకుంటామని వేలు హెచ్చరించారు. హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుని సినిమాలు తీస్తే సహించేది లేదని మంది పడ్డారు. అయితే ఈ వివాదంపై చిత్రబృందం మాత్రం సైలెన్స్ మైంటైన్ చేస్తోంది.

- Advertisement -

ఇక నయనతార విషయానికొస్తే ‘జవాన్’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. ఆ వెంటనే ఈ బ్యూటీ ‘అన్నపూరణి’ అనే చిన్న సినిమాలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అదికూడా కేవలం తమిళ భాషకే పరిమితం అయ్యింది. ఇక ప్రస్తుతం నయన్ రెమ్యూనరేషన్ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఈ బ్యూటీ ఏకంగా 12 కోట్ల వరకూ పారితోషికం అందుకుంటోంది అని టాక్.

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు