Vishwambara : అనుష్కను సైడ్ చేసేసిన మెగాస్టార్… ఆ హీరోయినే కావాలంటా?

మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఒక భారీ హిట్ తో పాటు భారీ ఫ్లాప్ ను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన “వాల్తేరు వీరయ్య” మూవీతో 200 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు. అయితే ఆయన అదే జోష్ తో “భోళా శంకర్” మూవీతో ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ మూవీ ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. అన్నా చెల్లెల అనుబంధం నేపథ్యంలో వచ్చిన ఈ అవుట్ డేటెడ్ స్టోరీని ప్రేక్షకులంతా కట్టగట్టి చెత్తబుట్టలో పడేశారు. దీంతో మెగాస్టార్ కొంచెం గ్యాప్ తీసుకుని ట్రాక్ మార్చే పనిలో పడ్డాడు. ‘బ్రో డాడీ’ రీమేక్ ప్లాను పక్కన పెట్టి ‘బింబిసార’ మూవీ డైరెక్టర్ వశిష్ట కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ సోషియో ఫాంటసీ మూవీకి ఏకంగా 300 కోట్ల దాకా బడ్జెట్ పెడుతున్నట్టుగా సమాచారం. ఈ ఫాంటసీ చిత్రానికి “విశ్వంభర” అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు మేకర్స్. సినిమా బడ్జెట్‌లో ఎక్కువ భాగం VFX కోసం ఖర్చు చేయబోతున్నారట. “విశ్వంభర” చిత్రంలో ప్రధాన విలన్ పాత్ర కోసం ఇప్పటికే రానా దగ్గుబాటిని ఫైనల్ చేశారు. ఈ భారీ బడ్జెట్ మూవీని యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం, నేపథ్య సంగీతం అందించనున్నారు. 2025లో రిలీస్ కానున్న ఈ సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు కనిపిస్తారని టాక్ నడుస్తోంది.

అందులో భాగంగానే అనుష్క శెట్టిని హీరోయిన్ గా తీసుకున్నారు అనే రూమర్ వైరల్ అయింది. కానీ తాజాగా బయటకొచ్చిన న్యూస్ ప్రకారం మెగాస్టార్ అనుష్కను పక్కన పెట్టేసారట. ప్రస్తుతం సత్తా చాటుతున్న సౌత్ బ్యూటీ త్రిషను తీసుకోబోతున్నారట. అనుష్క ప్లేస్ లో త్రిషను రీమేక్ చేస్తున్నారని తెలుస్తోంది. మరో హీరోయిన్ గా మోస్ట్ వాంటెడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నీ తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా సమాచారం.

- Advertisement -

ఇక సినిమాలో మరో ముగ్గురు హీరోయిన్లు ఇంకా ఖరారు కాలేదట. వీరందరూ ఫైనల్ అవ్వగానే అధికారిక ప్రకటన రానుంది. కాగా త్రిష ఇటీవల కాలంలో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో తన ఫ్యాన్ బేస్ ను మరింతగా పెంచుకుంటూ వస్తోంది. అయితే అనుష్క మాత్రం వెనకబడిపోయింది అని చెప్పాలి. ‘మిస్టర్ శెట్టి మిస్ పొలిశెట్టి’ మూవీతో రీఎంట్రీ ఇచ్చిన అనుష్క ఇప్పటిదాకా ఒక్క సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు