Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కి రూ. 80 కోట్ల ఫైన్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓ పక్క రాజకీయాలతో పాటు మరోపక్క సినిమాలతో బిజీగా ఉన్నారు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పవన్ కళ్యాణ్ ని చూసి అభిమానులు మా హీరో బాగా కష్టపడుతున్నాడు అనే సానుభూతిని చూపిస్తున్నారు. అయితే రాజకీయాలు చేస్తూ సినిమాలు చేయడం ఎందుకు..? రెండు పడవల మీద కాలు వేస్తున్నాడంటూ కొంతమంది పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్నారు.

అయితే ఈసారి ఎలాగైనా ఎన్నికలలో గెలవడానికి పవన్ కళ్యాణ్ అక్టోబర్ నెల నుండి తన సినిమాల షూటింగ్స్ మొత్తానికి బ్రేక్ ఇచ్చి కేవలం క్రియాశీలక రాజకీయ కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటున్నాడు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ తో పాటు ఎప్పుడో పూర్తి కావాల్సిన హరిహర వీరమల్లు షూటింగ్ ఆగిపోయింది. అయితే ఈ మూడు చిత్రాలలో పవన్ కళ్యాణ్ తన ఫోకస్ మొత్తాన్ని ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాల పైనే పెట్టాడు కానీ.. ఎప్పుడో వకీల్ సాబ్ సినిమా సమయంలో ప్రారంభించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. దీనిపై డైరెక్టర్ క్రిష్ తో పాటు నిర్మాత ఏఎం రత్నం తీవ్ర నిరాశలో ఉన్నారు.

ఈ చిత్రాన్ని పూర్తి చేయమని ఇప్పటికే నిర్మాత రత్నం, దర్శకుడు క్రిష్… పవన్ కళ్యాణ్ ని కలిసి కోరినప్పటికీ ఆయన నుండి ఎటువంటి స్పందన రాలేదని తెలుస్తోంది. దీంతో నిర్మాత రత్నం తీవ్రమైన అసహనంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఫైనాన్షియర్స్ నుండి 80 కోట్ల రూపాయలకు పైగా అప్పుచేసి హరిహర వీరమల్లు షూటింగ్ ని 60% కి పైగా పూర్తి చేశారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ షెడ్యూల్, డేట్స్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే సినిమాని పూర్తిస్థాయిలో ఇవ్వాల్సి ఉంటుంది.

- Advertisement -

అదే జరిగితే నిర్మత రత్నంకి ఎంతో నష్టం జరుగుతుంది. దీంతో ఏప్రిల్ నెలలోపు డేట్స్ సర్దుబాటు విషయంలో పవన్ కళ్యాణ్ ఏదో ఒక విషయం తేల్చకపోతే ఇప్పటివరకు పెట్టుబడిగా పెట్టిన 80 కోట్ల రూపాయల బడ్జెట్ వడ్డీతో సహా కట్టాలని పవన్ కళ్యాణ్ ని డిమాండ్ చేస్తున్నట్లుగా ఫిలింనగర్ లో ఓ వార్త వినిపిస్తుంది. ఇటీవలే బాబిడియోల్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ తాను ఒప్పుకున్న ఓ తెలుగు సినిమా ఆగిపోయిందని ప్రకటించారు. అయితే బాబీడియోల్ ఒప్పుకున్న సినిమా హరిహర వీరమల్లు కావడం గమనార్హం.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు