Vishwambhara: ఇప్పటినుండే సంక్రాంతికి ముందుచూపు

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మామూలు రోజుల్లో కంటే పండగ సీజన్ లో వచ్చే సినిమాలు అద్భుతమైన కలెక్షన్స్ ను రాబడతాయి. కనీసం యావరేజ్ టాక్ వచ్చిన కూడా అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతుంది. అదే సినిమాకి మంచి హిట్ టాక్ వస్తే ఆ సినిమా కోట్లు కొల్లగొడుతుంది. అలా చిన్న సినిమాగా వచ్చి మంచి టాక్ తో ముందుకెళ్లి కోట్లు కొల్లగొడుతున్న సినిమా హనుమాన్.

అయితే సంక్రాంతికి ప్రతిసారి థియేటర్ల విషయంలో చర్చలు జరుగుతూ ఉంటాయి. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలంటే చాలా రోజుల ముందే ఆ సినిమా రిలీజ్ ను అనౌన్స్ చేస్తారు. ఇకపోతే ప్రస్తుతం 2024 కి సంబంధించిన పండగ హీట్ కొంతమేరకు తగ్గిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు అందరు చూపు 2025 సంక్రాంతి పైన పడింది. ముందు నుంచే డేట్ అనౌన్స్ చేసేస్తే అప్పుడు చర్చలకు దారి తీసే అవకాశం ఉండదు. కాబట్టి ప్రశాంతంగా తమ సినిమా రిలీజ్ చేసుకొని కోట్లు కొల్లగొట్టచ్చు అని చాలామంది నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

కేవలం నిర్మాతలు మాత్రమే కాకుండా, హీరోలు కూడా తమ సినిమాలను అదే టైంలో అనౌన్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సీజన్ లో త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్, అలానే సీనియర్ హీరోస్ అయినా వెంకటేష్ , నాగార్జున సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటన్నిటిలో హనుమాన్ మంచి హిట్ అయింది. ఊహించని విధంగా కలక్షన్స్ ను రాబట్టింది. చాలామందికి ఇప్పుడు సంక్రాంతికి సీజన్ కి ఉన్న డిమాండ్ ఏంటి అని అర్ధం అయింది అందుకే ఇప్పుడే జాగ్రత్త పడటం మొదలుపెట్టారు.

- Advertisement -

ముందుచూపుగా ఇప్పటినుండే సంక్రాంతికి సినిమాలను అనౌన్స్ చేయటం మొదలుపెట్టారు. నాగార్జున నా సామి రంగ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ మళ్ళీ వచ్చే సంక్రాంతి కలుద్దాం అంటూ చెప్పుకొచ్చాడు. అంటే మళ్ళీ సంక్రాంతికి నాగ్ సినిమా రాబోతున్నట్లు హింట్ ఇచ్చాడు. చిరంజీవి నటిస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రానున్నట్లు తెలుస్తోంది. ముందుగానే ఇద్దరు స్టార్ హీరోలు సంక్రాంతికి పాగా వేశారు. ఇంకా ముందు ముందు ఇంకెన్ని సినిమాలు మళ్ళీ సంక్రాంతి బరిలో నిలబడుతున్నాయో తెలియాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేసి చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు