Double Ismart : “కల్కి” రిలీజ్ డేట్ కబ్జా చెయ్యడానికి ఇస్మార్ట్ శంకర్ రెడీ

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం టాలీవుడ్ లో రిలీజ్ డేట్ల విషయంలో కొనసాగుతున్న ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే “డబుల్ ఇస్మార్ట్” టీం ప్రభాస్ “కల్కి” మూవీ రిలీజ్ డేట్ పై కన్నేసినట్టు తెలుస్తోంది.

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో 2019లో రిలీజ్ అయిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “ఇస్మార్ట్ శంకర్”. ఈ మూవీ మాస్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించింది. రామ్ అద్భుతమైన నటన, పూరీ అదిరిపోయే మాస్ కంటెంట్ తో “ఇస్మార్ట్ శంకర్” బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు. ఆ తర్వాత ఒకవైపు రామ్, మరోవైపు పూరి జగన్నాథ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇద్దరూ వరుసగా డిజాస్టర్ లను ఎదుర్కొక తప్పలేదు. రామ్ రెడ్, వారియర్, స్కంద సినిమాలు చేసి హ్యాట్రిక్ డిజాస్టర్లను మూట కట్టుకున్నాడు. ఇక పూరి “లైగర్” సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా వీళ్ళిద్దరి కాంబోలో రూపొందుతున్న ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ “డబుల్ ఇస్మార్ట్”పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి ఫిలింనగర్ సర్కిల్స్ లో ఆసక్తికరమైన వార్త చెక్కర్లు కొడుతోంది.

ఇప్పటికే ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సిన “దేవర” వాయిదా పడితే “ఫ్యామిలీ స్టార్” మూవీని రిలీజ్ చేస్తామంటూ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ఆగస్టు 15న “పుష్ప 2” రిలీజ్ కాకపోతే “సరిపోదా శనివారం” మూవీతో తాము రెడీ అంటూ ఇప్పటికే నాని టీం కర్చీఫ్ వేసేసింది. ఇప్పుడు “కల్కి” రిలీజ్ డేట్ పై “డబుల్ ఇస్మార్ట్” టీం కన్నేసింది. “డబుల్ ఇస్మార్ట్” మూవీని మార్చ్ 8న రిలీజ్ చేయాలని ముందుగా మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తవ్వకపోవడంతో రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. మేలో “డబుల్ ఇస్మార్ట్” మూవీని థియేటర్లోకి తీసుకురావాలని పూరి సన్నాహాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే “కల్కి” మూవీ రిలీజ్ డేట్ గురించి ప్రయత్నాలు మొదలుపెట్టారట. గత కొన్ని రోజులుగా ప్రభాస్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కాస్ట్లీ ప్రాజెక్ట్ “కల్కి” వాయిదా పడబోతోంది అన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. “కల్కి”ని మే 9న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మూవీ వాయిదా పడే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ “కల్కి” మూవీ వాయిదా పడితే మే 9ని “డబుల్ ఇస్మార్ట్” టీం కబ్జా చేయాలనే ఆలోచనలో ఉందట. లేదా అనుకున్న ప్లాన్ ప్రకారం “కల్కి” మూవీ రిలీజ్ అయితే మే 29న “డబుల్ ఇస్మార్ట్” మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు