Chiranjeevi : మెగాస్టార్ నెక్స్ట్ మూవీ ఫిక్స్… పవన్ డైరెక్టర్ తోనే చిరు నెక్స్ట్

మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీ కన్ఫర్మ్ అయింది. పవన్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమాను ఆయన కూతురు సుష్మిత స్వయంగా నిర్మిస్తుండడం మరో విశేషం. ఈ తాజా ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే…

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “విశ్వంభర” అనే ఫాంటసీ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. “బింబిసార” ఫేమ్ వశిష్ట ఈ భారీ బడ్జెట్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న “విశ్వంభర” సెట్స్ లో త్వరలోనే చేరనున్నారు మెగాస్టార్ చిరంజీవి. 2025 సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీ గురించి అప్డేట్ బయటకు వచ్చింది. డైరెక్టర్, రచయిత బివిఎస్ రవి మెగాస్టార్ చిరంజీవికి ఒక కథను నేరేట్ చేశారట. ఆ స్టోరీకి ఫిదా అయిన చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కానీ ఈ మూవీకి దర్శకుడు విషయంలోనే చాలా కాలం పాటు అన్వేషణ సాగింది. ముందుగా ఈ సినిమా కోసం “బంగార్రాజు” ఫేమ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణను అనుకున్నారట. కానీ “భోళా శంకర్” మూవీ డిజాస్టర్ కావడంతో చిరంజీవి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు అని తెలుస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్టును రీమేక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ హరీష్ శంకర్ చేతుల్లో చిరు పెట్టాడని తెలుస్తోంది.

ఇక ఈ ప్రాజెక్టును ఆయన కూతురు సుస్మిత పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి నిర్మించబోతున్నారు. అయితే ఈ మూవీని నిర్మాణానికి కావలసిన బడ్జెట్ సమకూరుస్తూ, లాభాల్లో సగం వాటా తీసుకునే విధంగా పీపుల్ మీడియా వారు షరతు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే నిర్మాణ బాధ్యత మాత్రం సుష్మితదే అని తెలుస్తోంది. కాగా ఇదే బ్యానర్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా “ఉస్తాద్ భగత్ సింగ్” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ఈ మూవీ ఎప్పుడు పూర్తవుతుందో క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలోనే హరీష్ శంకర్ తో చిరంజీవి సినిమా చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి హరీష్ కు పవన్ కళ్యాణ్ ఇచ్చిన కమిట్మెంట్ ను చిరంజీవి పూర్తి చేస్తున్నట్టుగా అయ్యింది. వాస్తవానికి “ఉస్తాద్ భగత్ సింగ్” కోసం హరీష్ చాలా సమయాన్ని వృధా చేసుకున్నారు. పవన్ ఏపీలో ఎలక్షన్స్ పూర్తయిన తర్వాతే మళ్ళీ సినిమాలపై కాన్సన్ట్రేట్ చేయనున్నారు. అయితే ఆయన ముందుగా “ఓజీ”నే పూర్తి చేయబోతున్నట్లు సమాచారం. కాబట్టి హరీష్ శంకర్ “ఉస్తాద్ భగత్ సింగ్” మళ్లీ పట్టాలెక్కాలంటే చాలా సమయం పడుతుంది. అంతలోపు మెగాస్టార్ తో హరీష్ ఈ కొత్త ప్రాజెక్టును పూర్తి చేసేస్తాడు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు