Viswambhara
సాధారణంగా ఏదైనా ఒక పని చేసేటప్పుడు పూర్తి డెడికేషన్ తో చేయాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. అలా చేసినప్పుడే మన పనికి చక్కటి ప్రతిఫలం కూడా ఉంటుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా అదే స్ట్రాటజీ నమ్ముకున్నారనే చెప్పాలి. అందుకే ఎటువంటి సహాయ సహకారాలు లేకపోయినా నేడు మెగాస్టార్ గా చలామణి అవుతున్నారు అంటే… ఆయన తన పని మీద ఎంత దృష్టి పెడతారో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి తన 156వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ ని కూడా నిర్ణయించారు.
ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. వచ్చే సంక్రాంతికి సినిమాని విడుదల చేస్తామంటూ చిత్ర బృందం ప్రకటించగా.. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసే పనిలో పడ్డారు మేకర్స్. మాస్ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా ఉండబోతుందని ఇటీవల ఒక వీడియోని కూడా విడుదల చేశారు. మరి అందుకు తగ్గట్టుగానే చిరంజీవి కూడా తన బాడీ గెటప్ ను ఛేంజ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన జిమ్ లో వర్కౌట్స్ లు చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వీడియో పై అభిమానులు పాజిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు.
ఆ వీడియోలో చిరంజీవి వెయిట్ లిఫ్టింగ్ తో పాటు పలు రకాల ఎక్సర్సైజులు చేస్తూ కనిపించారు. చాలామంది అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా 70 సంవత్సరాల కు చేరువలో ఉన్నా కూడా ఆయనలో ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని.. ఏదైనా చేయాలి అంటే వయస్సుతో సంబంధం లేదు అంటూ నిరూపిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా వయసుకు మించి ఆయన పడుతున్న కష్టం నిజంగా ప్రశంసనీయమని చెప్పాలి. విశ్వంభర సినిమాలో మరింత యంగ్ గా కనిపించడానికి చిరంజీవి ఇప్పుడు సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.
Gearing up .. And raring to go #Vishwambhara pic.twitter.com/VeUj0yhN35
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 1, 2024
ఈ వీడియో చూస్తుంటేనే సినిమా కోసం చిరంజీవి ఎంత డెడికేషన్ గా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ సినిమా చిరంజీవి కెరియర్ లో టాప్ -10 బెస్ట్ సినిమాలో జాబితాలో టాప్ -3 లో ఉంటుందని వశిష్ట కూడా కాన్ఫిడెన్స్ గా చెప్పిన విషయం తెలిసిందే. ఇక యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రసాద్ విక్రమ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పుడు మరింత అంచనాలను పెంచేస్తోంది. ముఖ్యంగా చిరంజీవి జిమ్ లో కష్టపడుతూ గెట్ రెడీ ఫర్ విశ్వంభరా అంటూ చేసిన కామెంట్లు మరింత వైరల్ గా మారుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే చిరంజీవి ఈ సినిమాలో సరికొత్త లుక్కులో అందరినీ మెస్మరైస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఏ మేరకు ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.
Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.