VD12 : హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఫిక్స్… “గుంటూరు కారం” ట్రోల్స్ కారణంగానే ఛాన్స్

VD12

VD12 మూవీలో ఎట్టకేలకు హీరోయిన్ ఫిక్స్ అయింది. విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీలో హీరోయిన్ల గురించి రోజుకో వార్త వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముందుగా శ్రీలీల హీరోయిన్ గా నటించబోతోందని ప్రకటించారు. కానీ ఆ తర్వాత రష్మిక, యానిమల్ హీరోయిన్ తృప్తి దిమ్రి అంటూ రోజుకో హీరోయిన్ పేరు వినిపించింది. అయితే వీళ్ళందరూ కాకుండా మేకర్స్ మరో హీరోయిన్ మీనాక్షి చౌదరిని ఫిక్స్ చేశారట.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12వ మూవీని చాలా కాలం క్రితమే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నాగ వంశీ ఈ మూవీని ఫ్యాన్ ఇండియా రేంజ్ లో నిర్మించబోతున్నారు. ఈ మూవీలో విజయ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించబోతుందని మూవీని లాంచ్ చేసిన సమయంలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ మూవీని #VD12 పేరుతో స్టార్ట్ చేశారు.

కొంతవరకు షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న తరువాత ఈ మూవీకి బ్రేకులు పడ్డాయి. దీంతో ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతుంది అని వార్తలు వచ్చాయి. కానీ #VD12 ప్రాజెక్టుకు ఎక్కువ సమయం పట్టడం వల్ల దాన్ని పక్కన పెట్టేసి “ఫ్యామిలీ స్టార్”పై ఫోకస్ పెట్టాడు విజయ్. రీసెంట్ గా గౌతమ్ తిన్ననూరి “మ్యాజిక్” అనే చిన్న సినిమాను అనౌన్స్ చెయ్యడంతో #VD12 ప్రాజెక్ట్ పై అనుమానాలు తలెత్తాయి. కానీ “ఫ్యామిలీ స్టార్” తరువాత ఈ మూవీ పట్టాలెక్కుతుందని నిర్మాత నాగవంశీ ప్రకటించారు. ఇక ఇప్పుడు ఆయనే హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేశారట.

- Advertisement -

మీనాక్షి చౌదరిని #VD12లో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా ఫిక్స్ చేశారట. ముందుగా ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ తాజాగా ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో మీనాక్షి చౌదరిని తీసుకున్నారని సమాచారం. సంక్రాంతి కానుకగా రిలీజైన “గుంటూరు కారం” సినిమాలో మీనాక్షి చౌదరి పాత్రపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీని కూడా నాగ వంశీనే నిర్మించారు. అయితే కేవలం మహేష్ బాబు ఒళ్ళు నొక్కడానికి, ఆయనకు ఆమ్లెట్ వేసిచ్చే పని మనిషి పాత్రను “గుంటూరు కారం”లో మీనాక్షి పోషించింది అంటూ విమర్శించారు. ఆమె పాత్రపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. దీంతో ఇప్పుడు నాగ వంశీ #VD12లో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారట. మొత్తానికి మీనాక్షికి పని మనిషి నుంచి హీరోయిన్ గా ప్రమోషన్ ఇచ్చారంటూ సెటైర్లు వేస్తున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు