Matka: కొత్త పెళ్లి కొడుకు కోసం భారీ సెట్… ఏకంగా 8 ఎకరాల్లో!

కొత్త పెళ్లికొడుకు వరుణ్ తేజ్ కొత్త మూవీ “మట్కా” కోసం భారీ సెట్ ను నిర్మించారు. అంతటి భారీ సెట్ ను ఎక్కడ నిర్మించారు? అనే వివరాల్లోకి వెళితే…

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం హనీ మూన్ ఎంజాయ్ చేస్తున్నాడు. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ఈ మెగా హీరో ప్రేమించి, రీసెంట్ గానే పెళ్లాడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట ఫారిన్ లో ఉంది. ఇక అక్కడి నుంచి వచ్చి రాగానే వరుణ్ తేజ్ యాక్షన్ మోడ్ లోకి దిగబోతున్నాడు. పలాస ఫ్రేమ్ డైరెక్టర్ కరుణ కుమార్ తో వరుణ్ తేజ్ తన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీకి “మట్కా” అనే టైటిల్ ను ఖరారు చేశారు.

వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి, బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న మట్కా మూవీని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

- Advertisement -

ఈ నేపథ్యంలోనే మట్కా మూవీని చిత్రీకరించడానికి భారీ సెట్లు నిర్మించారట. శంషాబాద్ లో ఉన్న ఓ ప్రాంతంలో ఏకంగా 8 ఎకరాల్లో ఓల్డ్ సిటీ సెట్ నిర్మించారట. ఎనిమిది ఎకరాల్లో సెట్ అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ మూవీకి బడ్జెట్ ఏ రేంజ్ లో ఉండబోతోంది అనే విషయం ఈ సెట్ గురించి వస్తున్న వార్తలు చూస్తుంటేనే అర్థమవుతుంది. “మట్కా” మూవీ జూదం చుట్టూ తిరుగుతుందని, 24 ఏళ్ల స్పాన్ కలిగిన కథలో వరుణ్ తేజ్ నాలుగు విభిన్నమైన గెటప్ లలో ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. 1958 నుంచి 1982 మధ్య జరిగే కథ కావడంతో 50-80 ల మధ్య వాతావరణంలో రీ క్రియేట్ చేయడానికి ఈ సెట్ ను రూపొందించారు చిత్ర బృందం.

అప్పట్లో యావత్ దేశాన్ని కదిలించిన యదార్ధ సంఘటనల ఆధారంగా రూపొందనున్న ఈ కథ వైజాగ్ నేపథ్యంలో సాగుతుందని, ప్రస్తుతం నిర్మించిన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అత్యద్భుతమైన యాక్షన్స్ సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారని సమాచారం. ఇక ఈ మూవీ కోసం ఏకంగా నలుగురు ఫైట్ మాస్టర్లు పని చేయబోతున్నారట. ఇక మరోవైపు పెళ్లి కోసం సినిమా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చిన వరుణ్ తేజ్ త్వరలోనే ఈ మూవీ సెట్స్ లో జాయిన్ కాబోతున్నారు. ఇక చాలా కాలం నుంచి ఈ మెగా హీరోకు హిట్ పడలేదు. ఆయన కెరీర్లో 14వ చిత్రంగా రూపొందుతున్న “మట్కా” మూవీ తోనైనా హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు