Ustaad Bhagat Singh: లక్ అంటే హనీ రోజ్‌దే… ఏకంగా పవర్ స్టార్ సినిమాలోనే !

Ustaad Bhagat Singh

హాట్ బ్యూటీ హనీ రోజ్.. ఈ పేరు వింటే కుర్రకారు గుండెల్లో ఏదో తెలియని అలజడి. హనీ చేసే ఎక్స్‌పోజింగ్ కు పడిపోని వాడు ఉండడేమో. నిజానికి హనీ రోజ్ అంటే కొన్ని రోజుల క్రితం తెలుగు ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేదు. ఇన్ స్టాగ్రామ్ ను ఫాలో అయ్యే వారిలో అతి కొద్ది మందికి మాత్రమే హనీ పరిచయం.

కానీ, బాలయ్య నటించిన వీర సింహ రెడ్డి సినిమా వచ్చిన తర్వాత తెలుగు ఆడియన్స్ అందరి నోట హనీ రోజ్ పేరు వినపడుతూనే ఉంది. సినిమాలో గానీ, సినిమా రిలీజ్ కు ముందు జరిగిన ఫంక్షన్స్ లో గానీ, హనీ రోజ్ అందాల ఆరబోత ఇప్పటికీ మర్చిపోలేరు.

అయితే వీర సింహ రెడ్డి తర్వాత హనీకి తెలుగులో అవకాశాలు పుష్కలంగా వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ, అది జరగలేదు. ఇది ఆమె తెలుగు అభిమానులకు నిరాశనే. అయితే ఇప్పుడు తాజాగా హనీ రోజ్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హనీ రోజ్ ఒక కీలక పాత్రను దక్కించుకుందట.

- Advertisement -

అయితే ఈ సినిమాలో హనీ ఎక్స్‌పోజింగ్ కంటే, కట్టు బొట్టు కట్టుకుని పద్దతిగా ఉండే పాత్ర చేస్తుందని తెలుస్తుంది. ఇది ఆమె ఫ్యాన్స్ కి కొంత వరకు నిరాశే అయినా, చాలా రోజుల తర్వాత తెలుగు సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తుందనే ఆనందం కూడా ఉంది. అయితే సినిమాలో హనీ పాత్ర ఎలా ఉంటుంది? హరీష్ శంకర్ ఎలా డిజైన్ చేశాడు అనే ఆసక్తి ఇప్పుడు హనీ రోజ్ ఫ్యాన్స్ లో ఉంది.

కాగా, ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. రీమేక్ మూవీ అయినా, హరీష్ శంకర్ పైన నమ్మకంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ కూడా అంచనాలు పెంచుకుంటున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ పై పలు కీలక సన్నివేశాలను షూట్ జరిగింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు