Skanda: రామ్ పోతినేని లవ్ లో మోసపోయాడా.. ఆ అమ్మాయి ఎవరంటే..?

Skanda:

టాలీవుడ్ స్టార్ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేవదాస్ సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రామ్ ఓ సూపర్ హిట్ ని తన సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇండస్ట్రీలో తను ఓ స్థాయిలో ఎదిగి స్టార్ హీరోల చెంతకు చేరి వాళ్ళతో సైతం పోటీ పడే సినిమాలు ఎన్నో సంపాదించాడు. తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్కంద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ అందుకున్నాడు రామ్ పోతినేని.

ఇదిలా ఉంటే.. ఇటీవల సోషల్ మీడియాలో రామ్ లవ్ ఫెయిల్యూర్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. హీరో రామ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే ఓ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని తెలుస్తోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు అనుపమ పరమేశ్వరన్. అవును మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తో రామ్ పోతినేని ప్రేమాయణం నడుపుతున్నాడంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు అనుపమ పరమేశ్వరన్ కూడా తాను ప్రేమ పెళ్లి చేసుకుంటానని ఓపెన్ గానే చెప్పుకొస్తుంది. దీంతో రామ్ పోతినేని – అనుపమ ప్రేమాయణం నడుపుతున్నారన్న న్యూస్ వైరల్ అవుతుంది. తెరపై కూడా వీళ్ళ జోడి బాగా మెప్పించడంతో రియల్ లైఫ్ లో కూడా జంట బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ హీరో కూడా తన పెళ్లి గురించి ఏదైనా గుడ్ న్యూస్ చెబితే బాగుండని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు