Nagavamsi: గుంటూరు కారం నుంచి పూజాను తప్పించడానికి కారణం ఇదే… నిర్మాత ఓపెన్

Nagavamsi

త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి పూజా హెగ్డేకు ఉన్న అనుబంధమో.. ఇంకెదైన కారణమో కానీ, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారంలో బుట్టబొమ్మ మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. పూజా కార్యక్రమాల్లో కూడా పూజా పాల్గొంది. అంతే కాదు, ఈమెపై కొంత మేర షూటింగ్ చేశారు. కానీ, సడన్ గా గుంటూరు కారం నుంచి పూజా హెగ్డేను తప్పించి, మీనాక్షీ చౌదరీని తీసుకున్నారు. శ్రీలీలను మెయిన్ హీరోయిన్ గా చేసి, మీనాక్షీని సెకండ్ హీరోయిన్‌గా మార్చారు.

అయితే, సడన్ గా పూజా హెగ్డేను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది అనే ప్రశ్న ఇండస్ట్రీలో కొన్ని రోజుల పాటు మర్మోగిపోయింది.

త్రివిక్రమ్ వర్క్ పై మహేష్ అసంతృప్తిగా ఉన్నాడు. దీంతో త్రివిక్రమ్ కు ఇష్టమైన పూజా ను సినిమాను నుంచి బయటకు పంపించాడు.
త్రివిక్రమ్ – పూజా మధ్య చెడింది. అందువల్లే పూజాను త్రివిక్రమే సినిమా నుంచి తప్పుకుంది.
పూజా హెగ్డే కాలికి చిన్న ఫ్యాక్చర్ అయింది. బెడ్ రెస్ట్ తీసుకుంటుంది. అందుకే సినిమా నుంచి తప్పుకుంది.

- Advertisement -

ఇలా ఎన్నో సమాధానాలు సోషల్ మీడియాలో పుట్టుకొచ్చాయి.

కానీ, చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. అయితే తాజాగా పూజా వ్యవహారం పై ప్రొడ్యూసర్ సూర్య దేవర నాగ వంశి స్పందించాడు. గుంటూరు కారం మూవీని ముందుగా ఆగస్టులో రిలీజ్ చేయాలని అనుకున్నామని, తర్వాత కొన్ని కారణాల వల్ల సంక్రాంతికి వాయిదా వేయాల్సి వచ్చిందని చెప్పారు. అందువల్ల షూటింగ్ ని నెమ్మదిగా చేస్తున్నట్టు వివరించారు.

అయితే దీని వల్ల పూజా హెగ్డేకి ఇబ్బందిగా మారిందని, అదే సమయంలో పూజా బాలీవుడ్ లో కూడా ఒక మూవీ చేయాల్సి వచ్చిందని అన్నారు. దీంతో పూజా కి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో హీరోయిన్ ను మార్చాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అయితేే గుంటూరు కారం చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికే విడుదల చేస్తామని, మళ్లీ వాయిదాలు లాంటివి ఉండవని స్పష్టం చేశారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు