Mounika: భీమ్లా నాయక్ నటి విడాకులు.. కారణం..?

Mounika

షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ల ద్వారా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది నటి మౌనిక రెడ్డి. షణ్ముఖ్ జస్వంత్ హీరోగా వచ్చిన సూర్య లో హీరోయిన్ గా నటించి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది మౌనిక రెడ్డి. ఆ తర్వాత పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించింది. ముఖ్యంగా ఈ నటికి ఎక్కువ గుర్తింపు వచ్చింది మాత్రం భీమ్లా నాయక్ సినిమా ద్వారా.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన లేడీ కానిస్టేబుల్ గా నటించి ఎమోషన్స్ పండించింది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా మౌనిక రెడ్డికి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కొన్నాళ్లుగా సందీప్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్న మౌనిక రెడ్డి మనసులు కలిసిన తర్వాత గత ఏడాది డిసెంబర్ లో పెళ్లి చేసుకున్నారు. గోవాలో వీడి డెస్టినేషన్ వెడ్డింగ్ వైభవంగా జరిగింది. పెళ్లి సమయంలో మౌనిక చాలా ఎక్సైట్ అవుతున్న వీడియో అప్పట్లో చాలా పాపులర్ అయింది.

అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో తాజాగా ఈమె భర్తకు విడాకులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. తాజాగా మౌనిక తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను తన ఇంస్టాగ్రామ్ నుంచి తొలగించింది. అంతేకాకుండా తన భర్తను అన్ ఫాలో చేయడంతో ఆమె విడాకులు తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. పెళ్లి చేసుకోవడం, విడిపోవడం ఈ సెలబ్రిటీలకు చాలా సర్వసాధారణమైన విషయం అయిపోయిందని, ఏడాది గడవకముందే విభేదాలు, విడాకులు తీసుకోవడం ఏమాత్రం బాగోలేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు