Priyanka jain: మళ్ళీ ‘బొచ్చు’ టాపిక్.. ఏదో గుండు గీయించుకున్నట్టు ఫీల్ అవుతుందేంటీ?

బిగ్ బాస్ లో మళ్ళీ బొచ్చు టాపిక్ వచ్చేసింది. కంటెస్టెంట్స్ లో ఒక్కొక్కరూ వెళ్ళిపోతున్నా, కొత్త టాస్క్ లు వస్తున్నా, గేమ్ లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నా, అన్నిటికి మించి కంటెస్టెంట్స్ పాతవి మర్చి పోయి కొత్త రకంగా గేమ్ ఆడాలనుకుంటున్నా ఎవరూ ఆడలేకపోతున్నారు. పైగా ఒకర్ని నామినేట్ చేసినందుకు, ఆ విషయం గుర్తుంచుకొని మళ్ళీ నెక్స్ట్ టైం కావాలని నామినేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.

ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ 7 లో రెండు వారాల కిందట ఇచ్చిన టాస్క్ లో బిగ్ బాస్ అమర్ దీప్, ప్రియాంకల్లో ఎవరైనా పవర్ అస్త్ర కోసం ముందుకెళ్లాలంటే జుట్టు కత్తిరించుకోవాలని చెప్తాడు. దానికి అమర్ దీప్ వెనక్కి తగ్గగా, ప్రియాంక ఓకే చెప్తూ కొంత జుట్టును కత్తరించుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ విషయాన్ని ఐదో వారం నామినేషన్ లో మళ్ళీ ప్రస్తావించడం జరిగింది. ప్రియాంక యావర్ ని నామినేట్ చేస్తూ నువ్వు అమ్మాయిలు కొన్ని ఆటల్లో వీక్ అన్నావు, దానికి నామినేట్ చేస్తున్నా అంటూ ఉండగా, యావర్ దీనికి ఒప్పుకోకుండా, తనూ మాట్లాడుతూ నాకు పక్షపాతం లేదు,
ఇద్దరు లేడీస్ ఉన్నప్పుడు జెంట్స్ ఒక్కరు ఉంటే అతడ్నే నామినేట్ చేస్తారు, అదే అంటున్నాను, నేను ఎదుర్కొన్న టాస్క్ లు నువ్వు ఎదుర్కోలేవు అన్నాడు. నేను పేడను కూడా తినాల్సి వచ్చింది.

- Advertisement -

దీంతో ప్రియాంక నువ్వు పేడ తిన్నవేమో, నేను నా జుట్టుని కత్తిరించుకున్నాను. ఇది చాలా పెద్ద టాస్క్, ఇది స్టైల్ కాదు అంటుంది.

నిజానికి ప్రియాంక తన జుట్టు కత్తిరించుకుంటున్న సమయంలో మాట్లాడుతూ బిగ్ బాస్ నిజానికి టాస్క్ ఇచ్చినట్టు కాదు, నాకు ఇష్టమొచ్చిన స్టైల్ లో హెయిర్ స్టయిలింగ్ చేయించుకోమన్నట్టు ఉంది, అని అంటుంది. ఈ పాత వీడియో మళ్ళీ చూసి బిగ్ బాస్ మేమెర్స్ అందరూ ఆ టైం లో అలా అని, ఇప్పుడు ఎదో గుండు గీయించుకున్నట్టు, పెద్ద త్యాగం చేసినట్టు మాట్లాడుతుందేంటీ అని ట్రోల్ చేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు