Bigg Boss Telugu 7: సీజన్7లోనూ ‘బొచ్చు’ల సాంప్రదాయం… టెన్షన్‌లో ప్రియాంక జైన్

Bigg Boss Telugu 7

బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. హౌస్‌లో అందరూ కొత్త వాళ్లే అయినా మొదటి రోజు నుంచే ఇంట్రెస్టింగ్‌గా ఎంటర్‌టైనింగ్ సాగుతుంది. కంటెస్టెంట్స్‌ను సహనాన్ని పరిక్షించేలా టాస్క్ లు ఇస్తూ మధ్య మధ్యలో వారి మధ్య గొడవలు పెడుతూ ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడు బిగ్ బాస్. అయితే గత కొన్ని సీజన్స్ నుంచి ఓ టాస్క్ మాత్రం రిపీట్ అవుతూనే ఉంది. అదే హెయిర్ కట్. దీన్నే నెటిజన్లు బొచ్చు సాంప్రదాయం అని అంటున్నారు.

మొదటి సీజన్…

మొదటి సీజన్‌లో బిగ్ బాస్ ఈ హెయిర్ కట్ టాస్క్ ను తీసుకురాలేదు. కాగా, ఫస్ట్ సీజన్ లో బిగ్ బాస్ విన్నర్ గా శివ బాలజీగా నిలిచిన విషయం తెలిసిందే.

రెండో సీజన్…

బిగ్ బాస్ హౌస్‌లో హెయిర్ కట్ సంప్రదాయం ఈ రెండో సీజన్ నుంచే స్టార్ట్ అయింది. బిగ్ బాస్ హౌస్‌లో మొట్ట మొదటి సారి టాస్క్ లో భాగంగా హెయిర్ కట్ చేసుకుంది దీప్తి సునాయన. కాగా, రెండో సీజన్‌లో కౌశల్ మంద విన్నర్ గా నిలిచాడు.

- Advertisement -

మూడో సీజన్…

మూడో సీజన్‌లో హోస్ట్ నాగార్జున ఈ బొచ్చు సాంప్రదాయాన్ని కొనసాగించాడు. ఈ సీజన్‌లో యాంకర్ శివ జ్యోతి హెయిర్ కట్ చేసుకుంది. ఈ మూడో సీజన్‌లో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నెగ్గాడు.

నాలుగో సీజన్…

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అయితే ఏకంగా ఇద్దరు కంటెస్టెంట్స్ హెయిర్ కట్ చేసుకోవాల్సి వచ్చింది. అందులో ఒకరు సగం గుండు. అలేఖ్య హరికకి హెయిర్ కట్ టాస్క్ రాగా, అమ్మ రాజశేఖర్ కి సగం గుండు టాస్క్ వచ్చింది. అంతే కాదు. అమ్మ రాజశేఖర్ ఈ సగం గుండుతో ఏకంగా వారం రోజుల పాటు హౌస్ లో ఉన్నాడు. అయితే ఈ సీజన్ లో కూడా హెయిర్ కట్ చేసుకున్న వాళ్లు కప్ గెలవలేదు. ఈ నాలుగో సీజన్‌లో అభిజీత్ విన్నర్.

దీని తర్వాత సీజన్ అంటే బిగ్ బాస్ సీజన్ 6లో వాసంతి క్రుష్ణ టాస్క్‌లో భాగంగా హెయిర్ కట్ చేసుకుంది. అప్పుడు కూడా హెయిర్ కట్ చేసుకున్న కంటెస్టెంట్ విన్నర్ కాలేదు.

ఏడో సీజన్…

ఇప్పుడు సీజన్ 7లో పవర్ ఆస్త్రం కోసం హీరోయిన్ ప్రియాంక జైన్ తన హెయిర్ ని త్యాగం చేసింది. దీంతో పవర్ ఆస్త్ర పోటీలో అయితే నిలిచింది. అయితే ఇప్పుడు ఉంది అసలు సవాల్. హెయిర్ త్యాగంతో పవర్ ఆస్త్ర పోటీలో ఉన్నా.. అది నెగ్గుతుందా? అంటే ఈ వీకెండ్ వరకు వెయిట్ చేయాలి. అలాగే బిగ్ బాస్ చరిత్రలో హెయిర్ కట్ చేసుకున్న వాళ్లు ఎవరూ కూడా బిగ్ బాస్ కప్ ను టచ్ చేయలేదు. కనీసం రన్నర్ కూడా నిలవలేదు. ఇప్పుడు ఈ భయం ప్రియాంక జైన్‌కి ఉంది.

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు