Salaar: నెక్స్ట్ ఏసేది నిన్నే అని ఫిక్సయ్యావా బ్రహ్మన్న..!

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ “సలార్” థియేటర్లలో దుమ్ము లేపుతుంది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాను ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయగా, హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాలో తెలుగు నటులు చాలా తక్కువ మంది నటించారని ఆడియన్స్ అనుకున్నారు. కానీ రిలీజ్ అయ్యాక అందులో తెలుగు కాస్ట్ కూడా ఎక్కువ మంది నటించారని తెలిసింది.

ఇక మలయాళ స్టార్ పృత్విరాజ్ సెకండ్ లీడ్ గా నటించగా, జగపతి బాబు, బాబీ సింహ, శ్రీయ రెడ్డి, బ్రహ్మాజీ, ఈశ్వరి రావ్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు.

అయితే అసలు విషయానికి వస్తే ‘సలార్’ సినిమాలో పది మందికి పైగా భారీ స్టార్ క్యాస్టింగ్ తో కూడిన విలన్ గ్యాంగ్ లు ఉండగా, ఫస్ట్ పార్ట్ లో కేవలం ముగ్గుర్ని మాత్రమే దేవా(ప్రభాస్) చంపేస్తాడు. ఇక మిగతా వాళ్లలో ఎవరు ఎవర్ని ఇస్తారో సెకండ్ పార్ట్ లోనే తేలనుంది.

- Advertisement -

అయితే దీనిపై రిలీజ్ రోజు నుండి ఫ్యాన్స్ పేజ్ లో దేవా నెక్స్ట్ టార్గెట్ ఎవరనేది చర్చ జరుగుతూనే ఉంది. సినిమా క్యాస్ట్ లిస్ట్ పెట్టి మరీ ఫ్యాన్స్ డిబేట్ పెడుతున్నారు. ఇకపోతే అలాంటి ఫ్యాన్ పేజీల్లోంచి ఒక స్టిల్ తీసుకుని ఈ సినిమాలో వాలి పాత్రలో నటించిన బ్రహ్మాజీ నెక్స్ట్ టార్గెట్ ఎవరూ అంటూ తన ట్విట్టర్ పేజ్ లో సరదాగా సెల్ఫ్ ట్రోలింగ్ వేసుకున్నాడు.

ఇక ఈ ట్వీట్ చూసిన సలార్ ఫ్యాన్స్ నెక్స్ట్ ఏసేది నిన్నే అని ఫిక్సయ్యావా బ్రహ్మన్నా అంటూ ఫన్నీ మీమ్స్ వేస్తున్నారు. ఇక సలార్ ఫస్ట్ పార్ట్ లో బ్రహ్మాజీ స్క్రీన్ స్పేస్ తక్కువే ఉన్నప్పటికీ, సెకండాఫ్ లో తన పాత్ర కీలకం కానుందని, ఘనియార్ ట్రైబల్ జాతికి నాయకత్వం వహించేది బ్రహ్మాజీ అని తెలుస్తుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు