Psychology : ఫేక్ ఫ్రెండ్స్ ని కనిపెట్టాలా? ఈ టిప్స్ ఫాలో అయిపోండి

Psychology : స్నేహం అనేది మనుషులకు దొరికిన అమూల్యమైన వరం. అయితే ఆ వరాన్ని తక్కువ చేస్తూ కేవలం తమ అవసరాల కోసం మాత్రమే స్నేహితులను వాడుకునే వాళ్ళు నేటి సమాజంలో ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారి వల్ల నిజాయితీగా ఫ్రెండ్షిప్ చేసే వాళ్లకు ఎలాంటి ఉపయోగం ఉండదు. మరి ఇలాంటి ఫేక్ ఫ్రెండ్స్ ను ఎలా కనుక్కోవాలి అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? మీ సమాధానం అవును అయితే గనక ఈ టిప్స్ మీకోసమే. సైకాలజీలో ఫేక్ ఫ్రెండ్స్ ను కనుక్కోవడానికి ఉపయోగించే కొన్ని ముఖ్యమైన టిప్స్ ఫిల్మిఫై రీడర్స్ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాము. ఈ టిప్స్ తో మీ ఫ్రెండ్స్ ఫేకా? లేకపోతే నిజంగానే మీతో హానెస్ట్ గా ఫ్రెండ్షిప్ చేస్తున్నారా అనే విషయం తేలిపోతుంది. ఇక టిప్స్ లోకి వెళ్తే..

1. తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియని వాళ్ళు. ఫేక్ ఫ్రెండ్షిప్ చేసేవాళ్లు మీరు వాళ్ళకి క్లోజ్ ఫ్రెండ్స్ అని నమ్మిస్తారు. అయితే నిజమైన ఫ్రెండ్ షిప్ లో ఒకరి అవసరాలను ఒకరు తీర్చుకుంటారు. అలాగే ఎక్కువ తక్కువ తేడా లేకుండా అన్ని విషయాలను పంచుకుంటారు. కానీ మీ టైంను, శక్తిని లేదా మీ వస్తువులు ఇలా మీకు సంబంధించిన దేనినైనా సరే తీసుకోవడమే తప్ప తిరిగి ఇవ్వడం తెలియని వాళ్ళు మీ లైఫ్ లో ఉంటే పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఇలాంటి వాళ్లే ఫేక్ ఫ్రెండ్స్. వాళ్లకు ఏదైనా అవసరమైనప్పుడు మాత్రమే మీ దగ్గరకు వస్తారు. వాళ్ల సమస్యలను మాత్రమే పంచుకుంటారు. కానీ మీ సమస్యలను వినడానికి కూడా రెడీగా ఉండరు.

2. ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు, మీకు అవసరమైన సమయంలో అందుబాటులో లేని వ్యక్తులు ఫేక్ ఫ్రెండ్స్ లిస్ట్ లోకి వస్తారు. మీకు ఫ్రెండ్ అవసరం ఉన్నప్పుడు ఏదో ఒక సాకు చెబుతూ తప్పించుకుని తిరుగుతారు. బిజీగా ఉన్నాను, సమస్యలు ఉన్నాయి, తర్వాత కలుస్తాను ఇలాంటి సాకులు చెబుతున్నారు అంటే వాళ్లు నిజంగా మీ ఫ్రెండ్స్ కారు అని అర్థం. ఎందుకంటే నిజమైన స్నేహితుడు మీకు అవసరమైనప్పుడు అండగా నిలుస్తాడు

- Advertisement -

3. ప్రామిస్ ను నిలబెట్టుకోని ఫ్రెండ్స్ ఉంటే వాళ్లకు దూరంగా ఉండండి. ప్రామిస్ ఎవరైనా చేస్తారు కానీ నిజమైన ఫ్రెండ్స్ మాత్రమే వాటిని నిలబెట్టుకుంటారు. మీకు చేసిన ప్రామిస్ ను మీ ఫ్రెండ్స్ నిలబెట్టుకోవట్లేదు అంటే మీపట్ల, మీ ఎమోషన్స్, సమయం పట్ల వాళ్లకు గౌరవం లేదు అని అర్థం.

4. మీరు క్లోజ్ ఫ్రెండ్స్ గా భావించే వాళ్ల వల్ల నెగెటివ్ ఫీలింగ్ ఎక్కువైతే అది నకిలీ ఫ్రెండ్షిప్. సాధారణంగా నిజమైన ఫ్రెండ్స్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, వాళ్ళ సక్సెస్ ను ఇద్దరూ సెలబ్రేట్ చేసుకుంటారు. కష్ట సమయాల్లో చేదోడు వాదోడుగా నిలుస్తూ ఉత్సాహన్ని పెంచడానికి ట్రై చేస్తారు. అలా మీ చుట్టూ పాజిటివిటీని క్రియేట్ చేస్తారు. కానీ ఎలాంటి పరిస్థితిలోనైనా మీతో నెగిటివ్ గా, మీపై కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారంటే వాళ్ళు ఫేక్ ఫ్రెండ్స్ అని అర్థం.

5. గాసిప్ చేసేవారు మీ ఫ్రెండ్స్ లిస్టులో ఉంటే అవాయిడ్ చేయండి. గాసిప్ అనేది వినడానికి బాగానే ఉంటుంది. కానీ అది అలవాటుగా మారితే హానికరం. ఇతరుల సీక్రెట్స్ బయట పెట్టడం వాళ్ళ పట్ల గౌరవం లేకపోవడాన్ని చూపిస్తుంది. మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎప్పుడూ ఎవరో ఒకరి గురించి గాసిప్ చేస్తున్నారు అంటే ఇతరుల ముందు మీ గురించి కూడా అలాగే గాసిప్ చేస్తారు. నిజమైన స్నేహితులు ఎప్పుడూ ఒకరి నమ్మకాన్ని మరొకరు గౌరవిస్తారు. అంతేకానీ మీ గురించి పుకార్లు పుట్టించి మీ సీక్రెట్స్ ను ఇలా అపహాస్యం చేయరు.

6. స్నేహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ ఎప్పటికీ కాదు. ఇది పరస్పర గౌరవం, ప్రశంసలతో కంఫర్ట్ జోన్ ను పెంచే బంధం. కాబట్టి మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని పోటీగా భావిస్తున్నారు అంటే వాళ్లు మిమ్మల్ని, మీ సక్సెస్ ను చూసి కుళ్ళుకుంటున్నారు అని అర్థం. నిజమైన స్నేహితుడు ఎప్పుడూ ఫ్రెండ్ సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటారు. అంతేకానీ దాని విలువను తగ్గించే ప్రయత్నాలు చేయరు, మిమ్మల్ని చూసి అభద్రతాభావానికి లోనవ్వరు. అభద్రతాభావం ఉన్నచోట స్నేహం ఉండదు. కాబట్టి అలాంటి ఫ్రెండ్స్ కు గుడ్ బై చెప్పేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు