Personality Development: ఇలా చేశారంటే ఫస్ట్ మీటింగ్ లోనే ఫ్రెండ్స్ అవ్వడం ఖాయం

ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అనడం మనం చాలా సార్లు వింటూనే ఉంటాం. ఇక కొంతమందిని ఫస్ట్ టైం చూసినప్పుడు వీళ్లను మర్చిపోవడం అసాధ్యం ఏమో అనిపిస్తుంది. అంతేకాకుండా వాళ్లు ప్రవర్తించే తీరును చూస్తే ఏదైనా మ్యాజిక్ జరుగుతోందా ? అని అనుమానం కలుగుతుంది. చాలా అరుదుగా మనం కొత్త వారిని కలిసినప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం. వాళ్ళను కలిసింది అప్పుడే అయినా ఏదో ఏళ్ల తరబడి వాళ్ళు మనకు తెలిసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. అయితే ఇదేమి కో ఇన్సిడెంట్ కాదు. ఆగని అదృష్టం అంతకన్నా కాదు. కేవలం వాళ్లు పాటించే చిన్న చిన్న టిప్స్ మనల్ని ఇలా ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. మరి ఎవరినైనా ఫస్ట్ టైం మీట్ అయినప్పుడే మనతో మంచి ఫ్రెండ్స్ అయ్యేలా చేయాలి అని అనుకుంటే ఈ టిప్స్ మీకోసమే.

1. నిజాయితీగా నవ్వండి

Personality Development Tips How to become friends in the first meeting?
చిరునవ్వు అనేది పవర్ ఫుల్ వెపన్ లాంటిది. ఒక్కసారి అవతలి వ్యక్తితో చిరునవ్వు నవ్వుతూ మాట్లాడి చూడండి. ఆ పాజిటివిటీ ఎలా ఉంటుందో అర్థం కావడానికి సెకండ్స్ చాలు. ఎందుకంటే ఫస్ట్ టైం ఎవరినైనా మీట్ అయినప్పుడు టెన్షన్ గా ఉంటుంది. కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఫస్ట్ మీటింగ్ లో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు హృదయపూర్వకంగా చిరునవ్వుతో హాయ్ చెప్పారు అంటే గనక అది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక మీ కళ్ళలో కనిపించే మెరుపు, మీరు నిజాయితీగా నవ్వే ఈ చిన్న చిరునవ్వే ఎదుటి వ్యక్తిని కలవడం పట్ల మీరు నిజంగా సంతోషంగా ఉన్నారని తెలియజేస్తుంది. దీంతో అవతలి వ్యక్తి రిలాక్స్ అయ్యి మీతో స్నేహపూర్వకంగా కలిసి పోతారు.

- Advertisement -

2. వినడం

Personality Development Tips How to become friends in the first meeting?

వినడానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వండి. అందరూ మాట్లాడుతూనే ఉంటారు. కానీ మాట్లాడే వారి కన్నా వినేవారినే ఎక్కువగా ఇష్టపడతారు జనాలు. మాట్లాడటం కంటే ఎక్కువగా వినడం ద్వారా మీరు అవతలి వ్యక్తి ఆలోచనలు, అభిప్రాయాలకు విలువ ఇస్తున్నారనే అనుభూతి కలుగుతుంది. ఇక మీరు మాట్లాడే మాటలు అవతలి వ్యక్తిని డామినేట్ చేస్తున్నట్టుగా ఉండకూడదు అని గుర్తుపెట్టుకోండి.

3. బాడీ లాంగ్వేజ్

Personality Development Tips How to become friends in the first meeting?
ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు సరిగ్గా గమనిస్తే అవతలి వ్యక్తి బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉండడం చూడవచ్చు. ఒక్కొక్కరి బాడీ లాంగ్వేజ్ ఒక్కో రకంగా ఉంటుంది. ఒకవేళ అవతలి వ్యక్తి బాడీ లాంగ్వేజ్ ను మీరు కొంతవరకు కాపీ కొట్టగలిగితే వాళ్లు మీతో మరింత కంఫర్ట్ గా ఫీల్ అవుతారు.

4. అభినందనలు

Personality Development Tips How to become friends in the first meeting?
పొగడ్తలలో మ్యాజిక్ ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీరు ఎవరినైనా ఫస్ట్ టైం కలిసినప్పుడు వాళ్లలో ఉండే మంచి క్వాలిటీలను గుర్తించి అభినందించాలి. కలిసింది అప్పుడే అయినప్పటికీ అవతలి వ్యక్తికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనే విషయాన్ని మీరు ఇచ్చే కాంప్లిమెంట్ తెలియజేస్తుంది.

5. పర్సనల్ స్పేస్

Personality Development Tips How to become friends in the first meeting?
రిలేషన్ ఏదైనా ప్రతి ఒక్కరికి పర్సనల్ స్పేస్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అవతలి వ్యక్తి కంఫర్ట్ జోన్ కు మనం అనుగుణంగా ఉన్నప్పుడే వాళ్లు మనల్ని ఇష్టపడతారు. కాబట్టి ఎవరినైనా కలిసినప్పుడు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నట్టు గమనిస్తే వెంటనే వారికి పర్సనల్ స్పేస్ ఇవ్వండి. దీంతో ఫస్ట్ మీట్ లోనే ఇలా కావాల్సినంత పర్సనల్ స్పేస్ ఇచ్చి గౌరవించినందుకు అవతలి వ్యక్తి రిలాక్స్ అవుతారు. మీతో ఎంత సన్నిహితంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు అనే దానిపై అవతలి వ్యక్తికే కంట్రోల్ ఇస్తే, ఆ వ్యక్తి మీ సమక్షంలో గౌరవంగా, సురక్షితంగా ఉన్నట్టుగా భావిస్తారు.

6. పరధ్యానం

Personality Development Tips How to become friends in the first meeting?
బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్ అనేది మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఎవరినైనా ఫస్ట్ టైం కలిసినప్పుడు పరధ్యానంగా ఉన్నారు అంటే అవతలి వ్యక్తికి మీరు గౌరవం ఇవ్వట్లేదని, వాళ్లు ఇంపార్టెంట్ పర్సన్స్ అని మీరు భావించట్లేదని అనుకునే ప్రమాదం ఉంది.

7. హ్యూమర్

Personality Development Tips How to become friends in the first meeting?

హాస్యం అనేది ఒక అద్భుతమైన మెడిసిన్. దాన్ని సరైన సమయంలో కరెక్టుగా వాడితే ఎలాంటి సిచువేషన్ అయిన సరదాగా మారిపోతుంది. ఫస్ట్ మీటింగ్ లో మీ హ్యూమర్ ఉపయోగించి, ఏవైనా జోకులు వేస్తూ కలుపుగోలుగా ఉంటే అవతలి వ్యక్తి మీతో కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. జోక్స్ వేయడానికి ఖర్చు ఏం అవ్వదు కదా. కాబట్టి ఎవరిని హార్ట్ చేయకుండా జోక్స్ వేయగలిగితే ఆ స్కిల్ ను వాడండి. ఈ హ్యూమర్ కారణంగా అప్పుడే కలుసుకున్న వ్యక్తుల మధ్య కూడా స్నేహం, మంచి కంఫర్ట్ జోన్ డెవలప్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు