2023 Tollywood: ఈ ఏడాది ఇండస్ట్రీ కోల్పోయిన ప్రముఖులు వీళ్లే..!

ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ కొంతమంది ప్రముఖులను కోల్పోయింది. కొంతమంది మరణం బాధను మిగిల్చితే.. మరి కొంతమంది ఆకస్మిక మరణం పొంది శోకంతో పాటు షాక్ ని కూడా మిగిల్చారు. అయితే ఈ ఏడాది సినీ ఇండస్ట్రీ ఎంత మంది ప్రముఖులను కోల్పోయిందో ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకుందాం..

ప్రముఖ సీనియర్ నటి జమున జనవరిలో మరణించారు. జమున తన కెరీర్లో ఒకానొక దశలో అక్కినేని నాగేశ్వరరావు తో సమానంగా క్రేజ్ ను సంపాదించుకున్నారు. అప్పట్లో గరుసైన పాత్రలన్నీ కూడా ఆమె చేసేవారు. నిజజీవితంలో కూడా అదే వైఖరితో ఉండేవారు జమున.. తెలుగు, తమిళ్ , హిందీ, కన్నడ భాషల్లో వందల సినిమాలు చేసిన ఈమె రాజకీయాలలో కూడా రాణించి ఎంపీ అయ్యారు. ఇక వయోభారరీత్యా తన 86వ ఏటా మరణించారు.

ఇక అదే నెలలో టాలీవుడ్ స్టార్, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి కూడా కన్నుమూశారు. తెలుగులో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న ఈయన విజయనగరం నుంచి వచ్చి చెన్నైలో స్థిరపడ్డారు. ఎంతోమంది హీరోలకు గాత్ర దానం కూడా చేశారు. రాజశేఖర్ కి సాయికుమార్ తర్వాత డబ్బింగ్ చెప్పింది కూడా ఈయనే. ఇక అంతే కాదు సూర్య విక్రమ్ వంటి వారికి కూడా డబ్బింగ్ చెప్పారు..

- Advertisement -

ఆ తర్వాత నెల ఫిబ్రవరిలో కళాతపసి కే విశ్వనాథ్ కన్నుమూశారు తెలుగు చిత్ర పరిశ్రమకు శంకరాభరణం స్వాతిముత్యం సిరివెన్నెల, స్వర్ణకమలం, సాగర సంగమం, స్వయంకృషి, ఆపద్భాంధవుడు వంటి సినిమాలను అందించిన ఈయన అనారోగ్య సమస్యలతో మరణించారు.

అదే ఫిబ్రవరి నెలలో నందమూరి తారకరత్న కూడా కన్నుమూశారు రాజకీయ పాదయాత్రలో పాల్గొన్న గుండెపోటుతో కుప్పకూలారు. దాదాపు మూడు వారాలపాటు మృత్యుతో పోరాడి తృతీయ శ్వాస విడిచారు.

అదే నెలలో ప్రముఖ గాయని వాణీ జయరాం దర్శకుడు సాగర్ కూడా మరణించారు. సుమధుర గాత్రంతో 19 భాషలలో 20 వేలకు పైగా పాటలు పాడిన వాణి జయరాం ఐదు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక దర్శకుడు సాగర్ కూడా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. అమ్మ దొంగ, స్టువర్టుపురం దొంగలు ,రామసక్కనోడు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి.. మూడుసార్లు దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

మే నెలలో సీనియర్ నటులు శరత్ బాబు, మనోబాలతో పాటు సంగీత దర్శకుడు రాజ్ ని కూడా చిత్ర పరిశ్రమ కోల్పోయింది. ఇక జూన్ నెలలో రాకేష్ మాస్టర్ మరణించారు. ప్రముఖ టాలీవుడ్ హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న చంద్రమోహన్ కూడా ఇదే ఏడాది మరణించడం గమనార్హం.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు