Bigg Boss Season 6 : మరో జంట

టీవీ షోలలో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న షో బిగ్ బాస్. ఎక్కడో హాలీవుడ్ లో ఈ రియాల్టీ షో ప్రారంభమైంది. బాలీవుడ్ లోకి వచ్చి ఇప్పటి వరకు 15 సీజన్ లను పూర్తి చేసుకుంది. తాజాగా 16 సీజన్ రెడీ అవుతుంది. అలాగే టాలీవుడ్ లోనూ బిగ్ బాస్ కు ప్రాధాన్యత ఎక్కువగానే ఉంది. తెలుగులో ఇప్పటి వరకు ఐదు సీజన్లు పూర్తి అయ్యాయి. అలాగే ఓటీటీలో 24 గంటలు ప్రసారం అయ్యే విధంగా బిగ్ బాస్ నాన్ స్టాప్ ని కూడా తీసుకువచ్చారు. కానీ, ఇది ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.

దీంతో బిగ్ బాస్ అభిమానులు అందరూ సీజన్ 6 కోసం ఎదురుచూస్తున్నారు. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వస్తున్న ఈ షో.. నుంచి ఇప్పటికే రెండు ప్రోమోలు బయటకు వచ్చాయి. రెండో ప్రోమోలో.. బిగ్ బాస్ సీజన్ 6 సెప్టెంబర్ 4వ తేదీ నుండి టెలికాస్ట్ అవుతుందని ప్రకటించారు. అయితే ఈసారి హౌస్ లోకి వెళ్లే వాళ్లు వీరే అని కొంత మంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా మరో రెండు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ సారి హౌస్ లోకి సెలబ్రెటీ కపుల్ ను పంపించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. పలు సీరియల్స్ తో ఫేమస్ అయిన మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్ని లు హౌస్ లోకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. కాగా తెలుగు బిగ్ బాస్ చరిత్రలో రియల్ కపుల్ ను హౌస్ లోకి పంపించడం ఇది రెండో సారి. గతంలో మూడో సీజన్ సమయంలో టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్, వితిక షేర్ హౌస్ లోకి వెళ్లారు. అయితే ఇప్పుడు మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్ని వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు