The Ghost : ఒక్కడిని కూడా వదలడు

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా.. కుర్ర హీరోలకు దీటుగా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేస్తున్నారు కింగ్ నాగార్జున. ఈ క్రమంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో “ది ఘోస్ట్” అనే యాక్షన్ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు. ఈమూవీని అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రవీణ్ దర్శకత్వంలో వచ్చిన గరుడవేగ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు అదే కథాంశంతో వస్తున్న ” ది ఘోస్ట్” సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ చిత్రంలో నాగార్జున ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.బి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే అనిఖా సురేంద్రన్, గుల్ పనాగ్, మనిష్ చౌదరి, జయప్రకాష్, శ్రీకాంత్ అయ్యంగార్, రవి వర్మ, బిలాల్ హుస్సేన్ ముఖ్యపాత్రలు పోషించారు. తాజాగా చిత్ర యూనిట్ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. 1 నిమిషం 53 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ చిత్రంలో కష్టాల్లో ఉన్న అక్కను కాపాడడానికి విక్రమ్ ( నాగార్జున) ఎలాంటి సాహసాలు చేయాల్సి వచ్చింది. అసలు వారిని కిడ్నాపర్లు ఎందుకు చంపాలనుకున్నారు అన్న అంశంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. “చావును చాలాసార్లు దగ్గర నుంచి చూసాను ప్రియా” అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ సినిమాలో నాగ్ క్యారెక్టర్ ఎంత బలంగా ఉండబోతుందో స్పష్టం చేసింది. “ఇట్ నెవర్ స్టాప్స్.. ఒక్కన్ని కూడా వదలను” అంటూ నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొత్తం మీద ఘోస్ట్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు