Hanuman: బుల్లితెర పై హనుమాన్.. ఏ ఛానెల్.. ఎప్పుడంటే..?

Hanuman.. ఇండస్ట్రీలో ఎక్కడైనా సరే ఫెస్టివల్ వార్ అనేది కచ్చితంగా ఉండనే ఉంటుంది.. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాల మధ్య గట్టి పోటీ ఉంటుంది. అయితే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ సినిమాగా నిలిచిన చిత్రం హనుమాన్.. తక్కువ బడ్జెట్ తో అద్భుతంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు. ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే మూడు నెలలు కావస్తున్నా.. ఇప్పటికీ ఈ సినిమా ఓటీటీ లో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Hanuman:Hanuman on TV.. which channel.. when..?
Hanuman:Hanuman on TV.. which channel.. when..?

తెలుగే కాదు హిందీలో కూడా సత్తా..

థియేటర్లో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం దాదాపుగా 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు అందుకుంది. ఓటీటీలో కూడా బంపర్ హిట్ అందుకున్న హనుమాన్ చిత్రం ఇప్పుడు టీవీలో కూడా ప్రసారం కాబోతోంది. కుర్ర హీరో తేజ సజ్జ కూడా అద్భుతంగా ఈ సినిమాలో నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని కూడా చెప్పవచ్చు. తెలుగు, హిందీ తో పాటు విడుదలైన అన్ని భాషలలో కూడా హనుమాన్ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి విజయాన్ని సాధించింది.

జీ తెలుగు ఛానెల్ లో హనుమాన్..

ఓటీటీ లో కూడా పలు రికార్డులను తిరగరాసిన హనుమాన్ సినిమా.. ఇప్పుడు తెలుగు బుల్లితెర పైన ప్రసారమయ్యేందుకు సిద్ధమయ్యింది. ఈ సినిమాని జీ తెలుగు భారీ ధరకే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది ఏప్రిల్ 28న సాయంత్రం 5:30 నిమిషాలకు ఈ సినిమా ప్రసారం కాబోతోందంటూ పోస్టర్ తో సహా రిలీజ్ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రముఖ ఛానల్ జీతెలుగులో ప్రకారం కానుంది అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అందుకు సంబంధించి ఒక వీడియో క్లిప్ ను కూడా విడుదల చేసి మరీ పోస్ట్ షేర్ చేయడం జరిగింది. అటు అటు థియేటర్ ఇటు ఓటీటీ లలో మిస్ అయిన వారు బుల్లితెర పైన హనుమాన్ సినిమా చూడడానికి సిద్ధమవుతున్నారు.

- Advertisement -

చిన్న సినిమాగా వచ్చి పాన్ ఇండియా గా గుర్తింపు..

ఈ రోజున శ్రీరామనవమి సందర్భంగా హనుమాన్ సినిమా సీక్వెల్ కు సంబంధించి జై హనుమాన్ నుంచి ఒక పోస్టర్ను విడుదల చేశారు ప్రశాంత్ వర్మ.. ఈ పోస్టర్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ప్రతి సంక్రాంతికి కూడా తన నుంచి ఇలాంటి సినిమాలు ఎన్నో వస్తాయని కూడా గతంలో వెల్లడించారు.. థియేటర్లో, ఓటిటిలో హవా చూపించిన హనుమాన్ సినిమా మరి బుల్లితెరపై ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

హనుమాన్ సీక్వెల్ కూడా..

ఇకపోతే ఈ సినిమా రిలీజ్ అయిన రోజే హనుమాన్ సీక్వెల్ ఉంటుందని.. ఆ సినిమాకు జై హనుమాన్ అని టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వెల్లడించిన విషయం తెలిసిందే..అంతేకాదు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా సినిమా నుంచి పోస్టర్ తో అప్డేట్ కూడా ఇచ్చారు. మరి జై హనుమాన్ సినిమా ఎలా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు