Rakul Preet Singh: హైదరాబాద్ లో కొత్త బిజినెస్ పెట్టబోతున్న రకుల్ ?

Rakul is going to start a new business in Hyderabad: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఎక్కువగా ఇతర భాషల నుంచి వచ్చిన హీరోయిన్లు ఎక్కువగా ఉన్నారన్న సంగతి మనకు గుర్తుండే ఉంటుంది. ఇతర భాషల హీరోయిన్లు… అయినప్పటికీ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. అలాంటి హీరోయిన్లు లెక్క పెట్టలేనంత మంది ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. హీరోయిన్ రకుల్ ప్రీత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా యాక్టివ్గా, అలాగే అందంగా ఉండే హీరోయిన్లలో రకుల్ ప్రీతిసింగ్ ఒకరు. ఎప్పుడు ఫుల్ జోష్లో ఉంటుంది ఈ బ్యూటీ. అలాగే తన యాక్టింగ్ తో కూడా దుమ్ము లేపుతూ ఉంటుంది. ఇప్పటివరకు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది టాప్ మోస్ట్ హీరోల సరసన చాలానే సినిమాలు చేసింది ఈ బ్యూటీ. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోయిన్గా కూడా మారిపోయింది ఈ అందాల తార రకుల్ ప్రీత్ సింగ్.

కాగా ఇటీవల హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈమధ్య కాలంలోనే నిర్మాత జాకీ ని పెళ్లాడింది హీరోయిన్ రకుల్. ఈ ఇద్దరి వివాహం పెద్దల సమక్షంలోనే జరిగింది. వీరిద్దరి వివాహం రాజస్థాన్ లో చాలా గ్రాండ్గా చేశారు. అయితే పెళ్లి తర్వాత వెంటనే సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. నిత్యం సోషల్ మీడియాలో తన అందచందాలను ఆరబోస్తూ… అందర్నీ కనువిందు చేస్తోంది.

- Advertisement -
rakul-preeth-singh-entering in to restaurant business
rakul-preeth-singh-entering in to restaurant business

అలాగే తన భర్తతో చిన్న చిన్న ఫంక్షన్లకు వెళ్లి ఫోటోలను కూడా షేర్ చేస్తుంది. హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్. పెళ్లయిన తర్వాత కూడా పొట్టి బట్టలు వేసుకునేందుకు తన అత్తగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో తనకు నచ్చిన బట్టలు వేసుకొని తెగ తిరిగేస్తుంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అయితే తాజా సమాచారం ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ బ్యూటీ కొత్తగా వ్యాపారం పెట్టేసిందట.

ఆ వ్యాపారం హైదరాబాదులో పెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలలో తన పెట్టుబడులను పెట్టింది హీరోయిన్ రకుల్. అయితే తాజాగా హైదరాబాద్లో ఓ రెస్టారెంట్ కూడా ఓపెన్ చేసిందట. దానికి ఆరంభం అనే పేరు కూడా ఫిక్స్ చేశారట. అయితే ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచిందట ఈ బ్యూటీ రకుల్. తన పేరు బయటకు రాకుండా వేరే వారి పేరుతో ఈ రెస్టారెంట్ ను ఓపెన్ చేయించిందట ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు