Thriller Movie Ranam OTT : ఓటీటీలోకి నందితాశ్వేత విలన్‌గా నటించిన మిస్టరీ థ్రిల్లర్… అస్సలు మిస్ చేయకండి

Thriller Movie Ranam OTT : మిస్టరీ సినిమాలను ఇష్టపడే మూవీ లవర్స్ కోసం రణం అనే థ్రిల్లర్ మూవీ మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. వైభవ్, నందిత శ్వేత, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి షరీఫ్ దర్శకత్వం వహించారు. ర‌ణం అర‌మ్‌ థ‌వ‌రేల్ పేరుతో రూపొందిన ఈ తమిళ థ్రిల్లర్ మూవీ ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 5 కోట్లలోపే బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ 15 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. థియేటర్లలో రిలీజ్ అయిన రెండు నెలల తర్వాత ఓటిటిలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 19న రణం మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.

స్టోరీలోకి వెళ్తే… హీరో శివ తన భార్యను ఓ ప్రమాదంలో కోల్పోవడంతో మతిమరుపుతో బాధపడుతుంటాడు. ఆ ప్రమాదం కారణంగా ఆయన మెదడు దెబ్బతింటుంది. అయితే శివ మాధవరం పోలీస్ స్టేషన్లో ఫేస్ రిస్టోరేషన్ ఆర్టిస్ట్, క్రైమ్ స్టోరీ రైటర్ గా పోలీసులతో కలిసి పని చేస్తారు. ఛిద్రమైన శవాలకు పెయింటింగులు వేసి వాళ్ళ ఫేస్ ఎలా ఉండేది అనే విషయాన్ని పోలీసులకు అర్థమయ్యేలా చేస్తాడు. ఈ క్రమంలోనే ఎవరో అజ్ఞాత వ్యక్తి సగం కాలిన మనిషి శరీర వేర్వేరు భాగాలను వేర్వేరు పెట్టెలోను పెట్టి చెన్నైలోని మూడు ముఖ్యమైన ప్రదేశాల్లోని రోడ్లపై పారేస్తాడు. అందులో ముఖం మాత్రం ఉండదు. దీంతో అసలు ఆ భాగాలు ఎవరికి చెందినవి? ఈ మిస్టరీ మెన్ ఎవరు అని తెలుసుకోవడానికి హీరో శివ, పోలీస్ డిటెక్టివ్ తాన్యా హోప్ కలిసి పని చేస్తారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ అతను ఆ నేరస్తుడిని, హత్యల వెనుక ఉన్న కారణాన్ని కనుగొనడంలో సక్సెస్ అవుతాడు. మరి ఇంతకీ ఆ మిస్టరీ మాన్ ఎవరు? ఎందుకు ఇలా చేశాడు? నేరస్తుడిని ఎలా పట్టుకోవాలి? ఇందులో నందిత శ్వేత పాత్ర ఏంటి ? అనే ఇంట్రెస్టింగ్ స్టోరీతో మూవీ సాగుతుంది.

అయితే అప్పటికే భార్యను కోల్పోయిన బాధలో ఉన్న హీరోకు శారీరక సమస్యలు, శవాలకు రంగులు వేయడం, హత్య కేసులను పరీక్షించడం వంటి విషయాలను జోడించి ఆయన పాత్రను కాస్త తారుమారు చేశారని చెప్పొచ్చు. ఇక ఓ మేజర్ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చే పోలీస్ డిటెక్టివ్ గా తాన్యా పర్ఫెక్ట్ గా సరిపోయింది. కూతురి కోసం బాధపడే తల్లిగా నందిత శ్వేత నటన ఈ మూవీలో ప్రత్యేకంగా నిలుస్తుంది.

- Advertisement -

ఇక కుళ్లిపోయిన శవం ముఖానికి రంగులు వేయడం, క్రైమ్ స్టోరీ రాసుకోవడం లాంటి ఆసక్తికర కథనంతో స్క్రీన్ ప్లే మొదలవుతుంది. కొన్ని నిమిషాల్లోనే సినిమా యూటర్న్ తీసుకుని ప్రేమ సన్నివేశాలు, లవ్ సాంగ్స్, బార్ ఫైట్స్ లను చూపిస్తారు. ఆ కాసేపటికి మళ్ళీ యూ టర్న్ తీసుకొని ఘోరమైన నేరంలోకి దూసుకెళ్తుంది. మొత్తానికి ఫస్ట్ హా ఫ్ అక్కడక్కడ ట్విస్టులుఎం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సెకండ్ హాఫ్ పై ఇంటరెస్ట్ ను పెంచుతుంది. సెకండాఫ్ పర్లేదు అన్పిస్తుంది. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు మాత్రం లాజిక్ లెస్ గా అనిపిస్తాయి. సినిమాటోగ్రాఫర్ బాలాజీ కే రాజా తన లైటింగ్ టెక్నిక్స్ తో రాత్రి సన్నివేశాలకు కొత్తదనాన్ని తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేశారు. కానీ అరుణ్ కరోలి అందించిన సంగీతం పెద్దగా ఆకట్టుకోదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు