Nayanatara: హీరోయిన్ నయనతారకు కొత్త కష్టాలు ?

New difficulties for heroine Nayanthara : దక్షిణ భారతదేశంలో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొంతమంది చాలా కష్టపడి పైకి వస్తే… మరికొంతమంది ఎవరి బ్యాగ్రౌండ్ అయినా చూసుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. అలా అడుగుపెట్టి సక్సెస్ అయిన వారు కొంతమంది ఉంటే… మరికొంతమంది అట్టర్ ఫ్లాప్ అయిన వారు కూడా ఉన్నారు. ఇక మరి కొంతమంది హీరోయిన్లు ఎంతో కష్టపడి ఇప్పటికీ ఇండస్ట్రీలో రాణిస్తూనే ఉంటారు.

వారు తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాన్సులు కొట్టేస్తూ ఉంటారు. అలాంటి హీరోయిన్లలో నయనతార ఒకరు. స్టార్ హీరోయిన్ నయనతార గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని చెప్పవచ్చు. దాదాపు 16 సంవత్సరాలుగా దక్షిణ భారతదేశ ఇండస్ట్రీని ఈ బ్యూటీ ఏలుతోంది. ఇక ఈ మధ్యకాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టేసింది నయనతార. అంతేకాదు పెళ్లి అయినప్పటికీ ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా… హీరోయిన్ నయనతార కు ఏ మాత్రం డోకా లేదు.

New difficulties for heroine Nayanthara

టాలీవుడ్ ఇండస్ట్రీలో గానీ, లేదా తమిళ ఇండస్ట్రీలో లేకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలా ఎక్కడపడితే అక్కడ ఛాన్సులు వస్తూనే ఉన్నాయి. అంతేకాదు ఒక్కో సినిమాకు దాదాపు 10 కోట్ల వరకు కూడా ఈ బ్యూటీ డిమాండ్ చేస్తూ ఉందట. స్టార్ హీరోలకు పోటీగా రెమ్యూనరేషన్ తీసుకునేందుకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదట హీరోయిన్ నయనతార. లేడీ సూపర్ స్టార్ గా పేరుగాంచిన నయనతార ఇప్పటికే హీరోయిన్గా చాలా సినిమాలు చేసింది.

- Advertisement -

అంతేకాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి లేడీస్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. తెలుగులో పవన్ కళ్యాణ్ కు ఉన్నంత క్రేజ్ హీరోయిన్ నయనతారకు ఉంది. అయితే అలాంటి స్టార్ హీరోయిన్ నయనతారకు ఇప్పుడు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ బ్యూటీ కి ఇప్పుడు సవతి పోరు మొదలైందట. అయితే సవతి పోరు అంటే ఇంట్లో ఉండే గొడవ కాదు. ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ కారణంగా చాలా సమస్యలు ఎదుర్కొంటుందట నయనతార. New difficulties for heroine Nayanthara

ప్రస్తుతం భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న హీరోయిన్ నయనతారకు త్రిష రూపంలో పెద్ద చిక్కులు వస్తున్నాయట. నయనతార ఎక్కువగా రెమ్యూనరేషన్ అడిగితే…. ఆ సినిమాలో ఛాన్సులు త్రిష కు ఇస్తున్నారట దర్శక నిర్మాతలు. అటు త్రిష కూడా వరుసగా సినిమాలు కూడా ఒప్పేసుకుంటున్నారట. దీంతో హీరోయిన్ నయనతార కు కొత్త కష్టాలు మొదలయ్యాయి అని కొంతమంది సోషల్ మీడియాలో వార్తలు రాస్తున్నారు.

అయితే ఈ వార్తలు వైరల్ కావడంతో కొంతమంది నయనతార ఫ్యాన్స్ త్రిష పై ఫైర్ అవుతున్నారు. త్రిష కారణంగా నయనతార కు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని మండిపడుతున్నారు. అయితే మరికొంతమందికి చాలా డిఫరెంట్గా స్పందిస్తున్నారు. చాన్సుల కోసం కాస్త డబ్బులు తక్కువ తీసుకుంటే ఏమవుతుంది అని నయనతారను నిలదీస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు