Priyanka Chopra : ముఖంపై నెత్తుటి గాయాలతో దారుణమైన స్థితిలో ప్రియాంక… ఆమెకు ఏమైందంటే?

Priyanka Chopra : గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తాజాగా ముఖంపై నెత్తుటి గాయాలతో దారుణమైన పరిస్థితిలో కనిపించింది. అందరిని షాక్ కు గురి చేసిన ఆ ఫోటోలు ఎలా బయటకు వచ్చాయి? ఇంతకీ ప్రియాంకకు ఏం జరిగింది? అనే ఇంట్రెస్టింగ్ టాపిక్ లోకి వెళ్తే…

ప్రియాంక చోప్రా గాయపడిందా?

తాజాగా సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రాకు సంబంధించిన కొన్ని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఆమె ముఖం, చేతులపై తీవ్రమైన గాయాలతో, రక్తంలో తడిసి ముద్దయినట్టుగా కనిపిస్తోంది. ముఖంపై పలు చోట్ల గాయాలు కాగా ఒక కన్ను తీవ్రంగా దెబ్బ తిన్నట్టు, బాగా కందిపోయినట్టుగా కనిపిస్తోంది. కన్ను చుట్టూ మొత్తం నల్లగా మారిపోవడం, ముఖం కూడా ఉబ్బినట్టు కన్పించడంతో ఆమెను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. గ్లోబల్ స్టార్ కు ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక స్టార్ హీరోయిన్ ఇంతగా గాయపడటం ఏంటి అంటూ ఆమె అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు.

ఇంతకీ ప్రియాంక చోప్రాకు ఏమైంది?

అయితే నిజానికి ప్రియాంక చోప్రాకు ఆ ఫోటోలలో చూసినట్టుగా గాయాలు ఏమీ కాలేదని సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటోలు ప్రియాంక చోప్రా నటిస్తున్న సినిమా సెట్స్ లోనివి. తాజాగా ప్రియాంక చోప్రా చేస్తున్న మూవీలోని యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో తీసిన ఫోటోలేనట ఇవి. ఇక కంటి చుట్టూ కందిపోవడం, వాచిపోయిన ముఖం, దాని మీద రక్తం, గాయమైన గుర్తులు అన్నీ కూడా మేకప్ తో క్రియేట్ చేసినవే. కాబట్టి ప్రియాంక చోప్రాకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం ఆమె క్షేమంగా ఉంది. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తమ ఫేవరెట్ హీరోయిన్ కు ఏం కాలేదన్న సమాచారం తెలియడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ ఆ ఫోటోలు ఏ మూవీ షూటింగ్ లో తీసినవి అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు.

- Advertisement -

ప్రియాంక చోప్రా అప్ కమింగ్ సినిమాలు

ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ లోకి వెళ్లి సెటిల్ అయిన విషయం తెలిసిందే. తనకన్నా పదేళ్లు చిన్న వాడైనా నిక్ జోనాస్ అనే పాపులర్ అమెరికన్ సింగర్ ను పెళ్లాడింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ జంటకు ఒక పాప కూడా ఉంది. 2022 జనవరి 15న పుట్టిన ఆ పాప పేరు మాల్టీ మేరీ ప్రియాంక జోనాస్.

కాగా ఈ గ్లోబల్ బ్యూటీ ఇప్పటి దాకా హాలీవుడ్ లో బెవాచ్, ది మాట్రిక్స్ రీసెర్రెక్షన్స్, లవ్ అగైన్ వంటి రొమాంటిక్, కామెడీ, యాక్షన్ సినిమాల్లో నటించి మెప్పించింది. రీసెంట్ గా సిటాడెల్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ప్రియాంక ప్రస్తుతం దాని సెకండ్ పార్ట్ కు రెడీ అవుతోంది. అంతే కాకుండా ది బ్లఫ్ అనే 1800 కాలం నాటి పీరియాడిక్ డ్రామాలో హీరోయిన్ గా నటించబోతోంది. ఒకవైపు సినిమాలతో మరోవైపు ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతోంది ప్రియాంక.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు