Mahalakshmi: అప్పుడే భర్తతో నటి మహాలక్ష్మి విడాకులా..?

Mahalakshmi..సినీ ఇండస్ట్రీలో నటీనటుల లైఫ్ స్టైల్ ఎలా ఎప్పుడు మారుతుందో చెప్పలేము.. చాలామంది ప్రేమించి మరీ వివాహం చేసుకున్న తర్వాత విడిపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.. మరి కొంతమంది రెండవ వివాహం చేసుకొని.. తమ జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలా గడిచిన రెండు సంవత్సరాల క్రితం నుంచి ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంది నటి మహాలక్ష్మి.. ముఖ్యంగా ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ తో పెళ్లి జరిగినప్పటి నుంచి ఈమె పేరు బాగా వైరల్ గా మారింది.

Mahalakshmi:Is actress Mahalakshmi divorce with her husband?
Mahalakshmi:Is actress Mahalakshmi divorce with her husband?

మహాలక్ష్మి డబ్బు కోసమే రెండో వివాహం..

మరోవైపు నటి మహాలక్ష్మికి వివాహమయి ఒక కొడుకు ఉన్నప్పటికీ.. కూడా తన మొదటి భర్త నుంచీ కొన్ని కారణాల చేత విడిపోయి మళ్లీ నిర్మాత అయినటువంటి రవీందర్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ విషయం తమిళ ఇండస్ట్రీలోనే ఒక సెన్సేషనల్ గా మారిపోయింది. అయితే వీరి వివాహ సమయంలో వీరి పెళ్లి ఫోటోలు వైరల్ గా మారడంతో చాలామంది ఈమెను దారుణంగా ట్రోల్ చేశారు.. కేవలం డబ్బు కోసమే మహాలక్ష్మి రవీందర్ ను పెళ్లి చేసుకుందని కొంతకాలం పాటు ఈమె గురించి పలు రకాల రూమర్స్ కూడా ఎక్కువగా వినిపించాయి.

ట్రోల్స్ వైరల్..

అయినప్పటికీ కూడా ఎలాంటి విషయాలను పట్టించుకోకుండా మహాలక్ష్మి తన జీవితాన్ని మాత్రం బాగా ఎంజాయ్ చేస్తోంది. అప్పుడప్పుడు తన భర్తతో కలిసి ఉండే ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.. గడచిన కొన్ని నెలల క్రితం రవీందర్ ఒక కేసులో కూడా అరెస్ట్ కావడంతో అందరూ కూడా ఈ జంటని తెగ ఆడేసుకున్నారు.. అయినప్పటికీ మహాలక్ష్మి మాత్రం తన భర్తకు సపోర్టుగా నిలుస్తూ వచ్చింది. సోషల్ మీడియాలో నిత్యం తన భర్త పైన ఉండే ప్రేమను తెలియజేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది మహాలక్ష్మి.

- Advertisement -

విడకుల రూమర్స్..

తాజాగా కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మహాలక్ష్మి రవీందర్ మధ్య గత కొద్ది రోజులుగా విభేదాలు వస్తున్నాయని త్వరలోనే వీరిద్దరూ విడిపోబోతున్నారంటూ పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పైన మహాలక్ష్మి స్పందించి.. ఇందులో నిజం లేదని ఈ వార్తలను కొట్టి పారేసింది.. ఇప్పుడు తాజాగా మహాలక్ష్మి భర్త రవీందర్ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్టును షేర్ చేయడం జరిగింది. ఈ విషయమే అటు విడాకుల వ్యవహారానికి నాంది పలికిందంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.

విడాకులకు రూమర్స్ కి నాంది రవీందర్ ..

అసలు విషయం ఏమిటంటే రవీందర్ తన ఫోటోలు షేర్ చేసి..”నాలో నేను ఏదో మిస్సయ్యాను అంటూ రాసుకురావడం జరిగింది”. దీంతో ఈ పోస్ట్ చూసిన పలువురు నెటిజన్ లు సైతం మహాలక్ష్మికి దూరంగా రవీందర్ ఉంటున్నారనే అనుమానాలకు మరింత బలం చేకూర్చేలా పోస్ట్ పెట్టారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజానికి మహాలక్ష్మి రవీందర్ విడాకుల విషయంలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉన్నది. మరి ఈ విషయం పైన ఈ జంట స్పందిస్తుందేమో చూడాలి మరి.మొత్తానికి అయితే ఇంత అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య విడాకులు ఏంటి అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.. మరి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు