Mansoor Ali Khan: ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు.. ఆందోళనలో ఫ్యాన్స్..!

Mansoor Ali Khan.. ప్రముఖ నటులు మన్సూర్ అలీ ఖాన్ తాజాగా హాస్పిటల్ లో చేరారు.. ఈ విషయం తెలిసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. అసలు ఏమైందనే విషయానికి వస్తే.. ఛాతి నొప్పితో ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం తమిళనాడులోని వేలూరు లోకసభ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.. ఈ క్రమంలోనే ఈరోజు ప్రచారం చేస్తుండగా ఒక్కసారిగా ఛాతీ నొప్పి రావడంతో స్పృహ తప్పి పడిపోయారు. దీంతో అక్కడున్న వ్యక్తులు హుటాహుటిన మన్సూర్ అలీ ఖాన్ ను ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.. ఇక ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు మన్సూర్ అలీ ఖాన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు..

Mansoor Ali Khan:Famous actor admitted to hospital.. Fans are worried..!
Mansoor Ali Khan:Famous actor admitted to hospital.. Fans are worried..!

విషమంగా మన్సూర్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితి..

మరోవైపు ఆయన హెల్త్ గురించి ఎటువంటి సమాచారం అందలేదు.. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.. త్వరలోనే హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని కూడా వైద్యులు స్పష్టం చేశారు.

స్వతంత్ర అభ్యర్థిగా పోటీ..

మన్సూర్ అలీ ఖాన్ మొదట ఇండియా జననాయక పులిగళ్ పార్టీలో ఉంటూ ఎవరి అనుమతి లేకుండానే ఇంకొక పార్టీతో పొత్తుకు పాల్పడడం వల్లే..ఇండియా జననాయక పులిగళ్ పార్టీ ఇతడిని పార్టీ నుంచి తొలగించింది.. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా వేలూరు నుంచి పోటీ చేస్తున్నారు.. అందులో భాగంగానే తనను గెలిపించాలి అంటూ తమిళనాడులో తిరుగుతున్నారు ఇక నేటి ఉదయం ప్రచారంలో భాగంగా తిరుగుతూ ఉంటే ఉన్నట్టుండి ఛాతీ నొప్పి వచ్చి స్పృహ కోల్పోయారు. దీంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది..

- Advertisement -

మన్సూర్ సినిమాలు..

తమిళ సినిమాలలో విలన్ గా నటించి భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన తన నటనతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకున్నారు.. తెలుగులో కూడా విలన్ పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు..

హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు..

ఇదిలా ఉండగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా, త్రిష హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం లియో.. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.. అయితే ఈ సినిమాలో మన్సూర్ అలీ ఖాన్ నటించిన ఈ సినిమా ఈవెంట్లో త్రిష రేప్ చేసే సన్నివేశం మిస్ అయ్యాను అంటూ చెప్పి వివాదంలో ఇరుక్కున్నారు.. దీంతో త్రిష వివాదం వల్ల కూడా మన్సూర్ కి మరింత పేరు లభించింది.. ఇకపోతే ఇప్పటికే చాలామంది హీరోయిన్లతో తాను నటించిన సినిమాలలో రేప్ సన్నివేశాలు వచ్చాయని.. కానీ త్రిష తో కూడా ఆ సన్నివేశం వస్తుందని భావించాను.. అయితే అసలు నాకు త్రిషకు మధ్య సీన్సే లేవు..అలా త్రిషను రేప్ చేసే అవకాశాన్ని కోల్పోయాను అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. దీంతో త్రిష ఫైర్ అవ్వడమే కాదు చాలామంది కోలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు త్రిషకు అండగా నిలిచారు. ఆ తర్వాత త్రిష అతడిపై కేసులు పెట్టడం, కోర్టు వరకు వెళ్లడం జరిగింది. ఇక ఇదంతా ఇప్పుడు సద్దుమణుగుతున్న నేపథ్యంలో తాజాగా మన్సూర్ ఛాతీ నొప్పితో బాధపడుతున్నారని సమాచారం .ఇక ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు