Horror Movies on Netflix : నెట్ ఫ్లిక్స్ లో దెయ్యం సినిమాలు… ఒళ్ళు గగుర్పొడిచే ఈ మూవీస్ ను ఒంటరిగా చూశారంటే…

Horror Movies on Netflix : చాలామంది మూవీ లవర్స్ హారర్ సినిమాలను చూడటానికి ఇష్టపడతారు. దెయ్యం సినిమాలు అంటే భయమేస్తే దుప్పటి కప్పుకుని అయినా చూసేంత పిచ్చి ఉంటుంది కొంతమందికి. అయితే ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటిటిలు అందుబాటులోకి రావడంతో అందులో ఉన్న దెయ్యం సినిమాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు హాయిగా చూసేయొచ్చు. ఓటిటి ప్లాట్ ఫామ్ లో ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ లో మాత్రం కొన్ని ఒళ్ళు గగుర్పొడిచేంత భయంకరమైన సినిమాలు ఉన్నాయి. మరి అంతటి భయంకరమైన ఆ 5 ఇంగ్లీష్ సినిమాలపై ఓ లుక్కేద్దాం పదండి. కానీ ఒంటరిగా చూడకండి. భయంతో మీకేదైన జరిగితే మీదే బాధ్యత.

1. ది కంజురింగ్ 2013

2013లో విడుదలైన హారర్ మూవీ ‘ది కంజురింగ్’. ఇందులో ప్యాట్రిక్ విల్సన్, వెరా ఫార్మిగా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటిదాకా అనేక సీక్వెల్స్ విడుదలయ్యాయి. కానీ ది కంజురింగ్ మాత్రమే బెస్ట్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని ఎడ్, లోరైన్ వారెన్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించారు. పాత ఇంట్లో జరిగే పారానార్మల్ సంఘటనల నేపథ్యంలో ఉంటుంది స్టోరీ. చిత్రం జనాలను సక్సెస్ ఫుల్ గా భయపెట్టి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలిచింది.

2. వెరోనికా 2017

‘వెరోనికా’ 2017లో విడుదలైన హారర్ మూవీ. దీన్ని చూసిన తర్వాత మీరు భయంతో మీ చుట్టూ ఉన్న కిటికీలు, తలుపులను మూసివేయడం ఖాయం. ఇది ఓయిజాగా అనే డేంజరస్ ఆట ఆడుకునే ఓ యుక్తవయసు అమ్మాయి కథ. అందులో భాగంగానే తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ అమ్మాయి అనేక దుష్ట శక్తుల చేతికి చిక్కుతుంది. ఆ తరువాత ఏం జరుగుతుంది? అనే ఇంట్రెస్టింగ్ స్టోరీని నెట్‌ఫ్లిక్స్‌లో ఆస్వాదించవచ్చు.

- Advertisement -

3. ది ఎక్సార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్ (2005)

2005లో విడుదలైన ‘ది ఎక్సార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్’ చిత్రాన్ని హారర్ మూవీ ప్రియులు ఎలా మర్చిపోగలరు? ఈ అతీంద్రియ హారర్ డ్రామా ‘ది ఎక్సార్సిజం ఆఫ్ అన్నేలీస్’ పుస్తకం నుండి ప్రేరణ పొందింది. స్కాట్ డెరిక్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫాదర్ రిచర్డ్ మూర్ కేసును పరిశోధించే ఎరిన్ బ్రూనర్ కథను చెబుతుంది. ఫాదర్ రిచర్డ్ 19 ఏళ్ల ఎమిలీ రోజ్‌పై వశీకరణం చేసిన క్యాథలిక్ డియోసెసన్ పూజారి. మీరు ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు.

4. ది హాంటింగ్ ఇన్ కనెక్టికట్ (2009)

2009 సంవత్సరంలో విడుదలైన చిత్రం ‘ది హాంటింగ్ ఇన్ కనెక్టికట్’, పీటర్ కార్న్‌వెల్ దర్శకత్వం వహించిన ఒక అతీంద్రియ శక్తుల భయానక చిత్రం. ఈ హారర్ మూవీ స్టోరీ 1987 సంవత్సరంలో జరుగుతుంది. సారా కాంప్‌బెల్ క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటున్న తన కొడుకు మాట్‌ను ఆసుపత్రి నుండి ఇంటికి తీసుకు రావాలని అనుకుంటుంది. అందుకే ఆమె ఆసుపత్రికి సమీపంలో ఇల్లు కొనాలని నిర్ణయించుకుటుంది. సారా మళ్లీ ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఆమెకు ‘హౌజ్ ఫర్ రెంట్’ అనే బోర్డు కనిపిస్తుంది. ఆ తర్వాత ఆమె తన కొడుకు, భర్తతో కలిసి ఇల్లు చూడటానికి వెళుతుంది. అక్కడ మాట్ ఒక రహస్యమైన తలుపును చూస్తాడు. ఆ తరువాత ఏం జరుగుతుందో మూవీలో చూడాల్సిందే. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

5. ది పాప్ ఎక్సార్సిస్ట్ – 2023

2023లో విడుదలైన ‘ది పాప్ ఎక్సార్సిస్ట్’ హారర్ మూవీ. పాప్ వ్యక్తిగత మానసిక వైద్యుడు ఒకసారి ఒక ఇటాలియన్ గ్రామానికి వెళ్తాడు, అక్కడ అతను ఒక వ్యక్తిపై ఉన్న అనేక దుష్టశక్తులను గుర్తిస్తాడు. కథ అక్కడి నుండి ప్రారంభమవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు