Monkey Man on OTT : వరల్డ్ వైడ్ గా ఎదురు చూస్తున్న మంకీ మ్యాన్ ఇండియాలో థియేటర్ రాకముందే ఓటిటిలో… ఎప్పుడంటే?

Monkey Man on OTT : తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మంకీ మ్యాన్ మూవీతో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. స్లమ్ డాగ్ మిలియనీర్ మూవీతో పాపులర్ అయిన దేవ్ పటేల్ ఈ మూవీలో హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించారు. అంతేకాదు ఆయనే స్వయంగా నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక ఇందులో శోభిత ధూళిపాళ్ల వేశ్యగా నటించడం విశేషం. ఇక హాలీవుడ్ లో ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ఇండియాలో మాత్రం ఇంకా రిలీజ్ కాకముందే ఓటిటిలో ఎప్పుడు రాబోతోంది అనే విషయంపై చర్చ నడుస్తోంది.

అక్కడ రిలీజ్… ఇక్కడ సెన్సార్ సమస్యలతో బ్రేక్

ఏప్రిల్ 5న అమెరికాతో పాటు కెనడా వంటి మరిన్ని దేశాల్లో యాక్షన్ థ్రిల్లర్ మూవీ మంకీ మ్యాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియాలో మాత్రం ఏప్రిల్ 19న థియేటర్లలోకి రాబోతోందనీ టాక్ నడుస్తోంది. నిజానికి ఈ మూవీని విదేశాలతో పాటు ఇండియాలో కూడా ఒకేసారి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ భారతీయ పురాణాల నుంచి స్ఫూర్తి పొందుతూ దేవ్ పటేల్ మంకీ మ్యాన్ కథ సాగుతుంది.

ముఖ్యంగా ఆంజనేయ స్వామి, ఆయన రూపమైన మంకీ మాస్క్ తో కథ ముందుకు నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే సినిమాలోని పలు యాక్షన్ సన్నివేశాలు, బోల్డ్ సన్నివేశాలు ఉండడంతో, అవి భారతీయుల మనోభావాలు దెబ్బ తీసే అవకాశం ఉందనే కారణంతో సెన్సార్ బోర్డు ఈ మూవీకి అభ్యంతరాలు తెలిపింది. దీంతో మంకీ మ్యాన్ మూవీ ఇక్కడ వాయిదా పడింది. అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.

- Advertisement -

మంకీ మ్యాన్ ఓటిటిలోకి వచ్చేది అప్పుడే…

ఇక మంకీ మాన్ మూవీ మొత్తం తనకు జీవితంలో ఎదురైన పరాభవాలు, చేదు అనుభవాలకు హీరో మంకీ మాస్క్ ధరించి ఎలా రివేంజ్ తీర్చుకున్నాడనే యాక్షన్ అంశాలతో ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఇక ఇండియాలో ఎప్పుడు మంకీ మ్యాన్ మూవీ రిలీజ్ అవుతుందనే విషయంపై క్లారిటీ ఇంకా రానేలేదు. అంతలోనే ఓటిటిలోకి ఈ మూవీ ఎప్పుడు రాబోతోంది అని ఆరా తీయడం మొదలు పెట్టారు. ఇండియాలో థియేటర్లలో రిలీజ్ అయిన రెండు వారాల తర్వాత మంకీ మ్యాన్ ఓటీటీలోకి రాబోతున్నట్టు తెలుస్తోంది.

మంకీ మ్యాన్ మూవీ వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. సమాచారం ప్రకారం మే 9 నుంచి మంకీ మ్యాన్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందని టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ మే ఫస్ట్ వీక్ లో రాబోతుందని తెలుస్తోంది. అందరూ భారతీయులే నటించిన ఈ హాలీవుడ్ మూవీ 10 మిలియన్ల బడ్జెట్ తో రూపొందగా, 25 మిలియన్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యం లోనే ఈ మూవీ ఇండియాలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ? అని దేవ్ పటేల్ అభిమానులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు