AA Films : పాన్ ఇండియా మూవీస్ పై బాలీవుడ్ బడా నిర్మాత ఫోకస్!

AA Films : టాలీవుడ్ లో ఈ ఏడాది భారీ పాన్ ఇండియా సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతున్నాయి. ఈ ఇయర్ లో పాన్ ఇండియా వైడ్ గా హనుమాన్ మాత్రమే రిలీజ్ అయ్యి ఘానా విజయం సాధించగా, సమ్మర్ ఎండింగ్ నుండి వరుసగా క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ పాన్ ఇండియా
వైడ్ గా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇక ఈ ఇయర్ రాబోతున్న భారీ సినిమాలపై ఇండియా వైడ్ గా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలు సక్సెస్ అయితే 2024 లో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ హవా కనిపిస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక సౌత్ సినిమాల పట్ల నార్త్ ఇండియాలో విపరీతమైన ఆదరణ పెరిగింది. ముఖ్యంగా టాలీవుడ్ చిత్రాలు అంటే నార్త్ ప్రేక్షకులు ఎంతో ఇంట్రస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. అందువల్ల బాలీవుడ్ బడా డిస్టిబ్యూటర్స్ ముందుకొచ్చి తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ రిలీజ్ రైట్స్ ని సొంతం చేసుకుంటున్నారు. అయితే ఈ రేసులో బడా డిస్టిబ్యూటర్స్ మాత్రమే నిలబడగలుగుతున్నారు.

AA ఫిలిమ్స్ చేతిలో పాన్ ఇండియా మూవీస్..

మొన్నటివరకు కరణ్ జోహార్ తెలుగు సినిమాలపై ఎక్కువ ఫోకస్ చూపించగా, ఈ ఏడాది టాలీవుడ్ నుండి రాబోయే మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమాలని AA ఫిలిమ్స్ (AA Films) హిందీలో రిలీజ్ చేస్తుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని టాలీవుడ్ సినిమాల రిలీజ్ రైట్స్ ని భారీ ధరలకు సొంతం చేసుకోవడం విశేషం. ఇంతకు ముందు ఆయన ఇతర సంస్థలతో కలిసి పార్టనర్ గా బాహుబలి, పుష్ప, కాంతార, KGF లాంటి సినిమాలను నార్త్ లో డబ్ చేసి విడుదల చేశారు. ఇప్పుడు పార్టనర్ గా కొన్ని సినిమాలను చేస్తూనే, మరికొన్ని నేరుగా సినిమాలని డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. తాజాగా డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ మూవీ కల్కి 2898AD సినిమాని అనిల్ తాడని బాలీవుడ్ లో రిలీజ్ చేయనున్నారు. జూన్ ఆఖరులో లేదంటే జులైలో సినిమాని రిలీజ్ చేయొచ్చని టాక్ వినిపిస్తోంది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప ది రూల్ ఆగష్టు 15న రిలీజ్ కాబోతోంది.ఈ సినిమాని కూడా నార్త్ లో అనిల్ తడాని రిలీజ్ చేయబోతున్నారు.

బడా మూవీస్ అన్ని కరణ్ తో కలిసి AA చేతికే ..

ఇక కల్కి, పుష్ప2 మాత్రమే కాకుండా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర చిత్రాన్ని ధర్మా ప్రొడక్షన్ తో కలిపి అనిల్ తడాని రిలీజ్ చేయబోతున్నారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో రెడీ అవుతోన్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ నార్త్ ఇండియా రైట్స్ ని అనిల్ సొంతం చేసుకున్నారు. ఈ నాలుగు సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే సినిమాలు కాబోతుండడం వల్ల, అనిల్ తడాని రిలీజ్ చేస్తూ ఉండటం వల్ల ఈ సినిమాలకి నార్త్ లో స్ట్రాంగ్ ప్రమోషన్స్ లభిస్తాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. అలాగే విశ్వంభర లాంటి సౌత్ బిగ్ బడ్జెట్ సినిమాలపై కూడా అనిల్ ఫోకస్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు