Tollywood : బోసిపోతున్న సమ్మర్.. సినిమాల వాయిదాల పర్వం..

Tollywood : టాలీవుడ్‌ లో సంక్రాంతి, దసరా కన్నా పెద్ద సీజన్ ఏది అంటే అది సమ్మర్ సీజన్ అనే చెప్పాలి. సంక్రాంతి కి గాని దసరా కి గాని చిన్నా పెద్దా కలిసి మహా అయితే అరడజను సినిమాలు వస్తాయి గాని. కానీ సమ్మర్ సీజన్ దాదాపు రెండు నెలల పాటు ఉంటుంది. దాదాపు నాలుగైదు బడా సినిమాలు ఈ సీజన్లో వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీడియం రేంజ్ హీరోల సినిమాలు మొదలుకొని, చిన్న సినిమాలు కూడా మంచి క్రేజీ బజ్ తో రిలీజ్ అవుతుంటాయి. మంచి సినిమాలు పడితే వెయ్యి కోట్లకు పైగా ఈ సమ్మర్ సీజన్‌ లో వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ 2024 సమ్మర్ సీజన్ మొత్తం కూడా బూడిదలో పోసిన పన్నీరు లాగా వృధా అయిపోతుంది. ఈ సమ్మర్ సీజన్‌ ఫ్యామిలీ స్టార్‌ సినిమాతో ఆరంభం కాగా, ఫస్ట్ సినిమాతోనే డిజాస్టర్ చవిచూసింది టాలీవుడ్(Tollywood). దానికి ముందు టిల్లు స్క్వేర్ సినిమా వచ్చి మెప్పించింది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు, అంతకు ముందు వచ్చిన సినిమాలు ఏవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.

బడా సినిమాల వాయిదాల పర్వం..

సమ్మర్ లో బడా హీరోల చిత్రాలు మొదట్లో రేసులో ఉండగా, సంక్రాంతి తర్వాత ఒక్కో సినిమా రిలీజ్ డేట్ దగ్గరయ్యే కొద్దీ సమ్మర్ బరి నుండి తప్పుకున్నాయి. ముందుగా ఎన్టీఆర్ దేవర సమ్మర్ రిలీజ్ నుండి దసరా కి షిఫ్ట్ కాగా, అంతకు ముందే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా సమ్మర్ రేసు నుండి తప్పుకుంది. అలాగే అన్ని కుదిరితే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సమ్మర్ లో రావాల్సింది. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల వల్ల ఏకంగా సినిమాని ఆగిపోయింది. ఇక వచ్చే మే నెలలో కూడా పెద్ద సినిమాలు లేవు. ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ కే ‘కల్కి’2898AD ని ఇప్పటికే వాయిదా వేయడం జరిగింది. ఇక స్టార్ సీనియర్ స్టార్ హీరోల సినిమాలు కొన్ని అసలు మొదలేకాకపోగా, బాలయ్య బాబీ సినిమా ఎప్పుడో తప్పుకుంది. ఓవరాల్ గా సమ్మర్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాలు చిన్న సినిమాలే ఉన్నాయి. కానీ అందులో కూడా ఏ సినిమాలకు పెద్దగా క్రేజీ బజ్ అనేది లేదు.

IPL, ఎన్నికల వల్ల వాయిదా?

అయితే చాలా సినిమాలు వాయిదా పడడానికి మరో కారణం ఐపీఎల్, అలాగే ఎలక్షన్ల సమయం కూడా అని చెప్పొచ్చు. మొన్న వచ్చిన ఫ్యామిలీ స్టార్ కి అంత దారుణమైన ఓపెనింగ్స్ రావడానికి ఐపీఎల్ మ్యాచ్ కూడా కారణం అని చెప్పొచ్చు. అలాగే సమ్మర్ ఎండల వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా థియేటర్లకు రావడం లేదు. మొత్తానికి ఐపీఎల్‌, ఎండలు, ఎన్నికల వల్ల పదుల సంఖ్యలో సినిమాలు వాయిదాల పర్వం కొనసాగుతున్నాయి. ముందు ముందు ఒకే సారి పెద్ద, చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది. ఇక దాదాపు జులై నుంచి సినిమాల జాతర మొదలయ్యే అవకాశం ఉంది. ప్రేక్షకులు థియేటర్లకు రాకుండా ఎండలు, ఐపీఎల్‌ మరియు ఎన్నికలు అడ్డు పడుతున్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలో సినిమాను విడుదల చేసి నష్టపోవడం కంటే కాస్త విడుదల చేసుకోవడం మంచిది అనే అభిప్రాయాన్ని చాలా మంది నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు ఈనెలలో విడుదల అవ్వాల్సిన నవదీప్‌ ‘లవ్‌ మౌళి’, శశివదనే సినిమాలు ఆల్రెడీ వాయిదా పడ్డాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు