Pooja Hegde: పూజా హెగ్డే సినీ కెరియర్ నాశనం అవ్వడం వెనక ఆ హీరో..?

Pooja Hegde: టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించాలంటే కొన్ని గట్స్ ఉండాలి. ప్రస్తుత కాంపిటీషన్ నేపథ్యంలో… ఎన్నో సవాళ్లు వస్తాయి. వాటన్నిటిని ఎదుర్కొంటూ ముందుకు సాగాలి. లేకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ ఒక్క నటీనటులు సక్సెస్ కాలేరు. ఎలాంటి ఉపద్రవాన్నైనా ఎదుర్కొనేలా…. రెడీగా ఉండాలి నటీ నటులు. లేకపోతే ఇతరులు వచ్చి తొక్కేస్తారు. ఇండస్ట్రీలో రాణించాలంటే పట్టుదలతో పాటు కాస్త టాలెంట్ కూడా ఉండాలి. ఆ మాత్రం టాలెంట్ లేకపోతే కూడా ఇండస్ట్రీలో రాణించడం చాలా కష్టమవుతుంది.

ఇక హీరోయిన్లలో టాలెంట్ తో పాటు ఎక్స్పోజింగ్ బాగా చేయాల్సి ఉంటుంది. లేకపోతే దర్శక నిర్మాతలు హీరోయిన్లకు అస్సలు ఛాన్సులు ఇవ్వరు. అందుకే మన తెలుగు హీరోయిన్లకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా చాన్సులు రావు. ఇతర భాషల హీరోయిన్లు ఎక్స్పోజింగ్ బాగా చేస్తారు కాబట్టి వారికి ఆఫర్లు ఇస్తూ ఉంటారు దర్శకనిర్మాతలు. అలా ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయినా హీరోయిన్లు చాలా ఉన్నారు. అలాంటి హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు.

హీరోయిన్ పూజ హెగ్డే గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ముకుంద మరియు ఒక లైలా కోసం లాంటి సినిమాలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టింది హీరోయిన్ పూజా హెగ్డే. ముకుంద సినిమాలో చాలా సాంప్రదాయ బద్ధంగా తెలుగు హీరోయిన్ల మెరిసింది. అయితే తర్వాత ఆమె చేసిన ప్రతి సినిమాలో పొట్టి బట్టలు వేసుకొని… అందరినీ కనువిందు చేసింది. అందుకే టాలీవుడ్ ఇండస్ట్రీలో పూజ హెగ్డే టాప్ మోస్ట్ హీరోయిన్గా కొన్ని రోజులు కొనసాగింది.

- Advertisement -

అలా ఎక్స్పోజింగ్ చేసింది కాబట్టి అల్లు అర్జున్, అఖిల్ అలాగే అక్కినేని నాగచైతన్య లాంటి టాప్ హీరోల సినిమాలలో కూడా నటించింది హీరోయిన్ పూజ హెగ్డే. ముఖ్యంగా హీరోయిన్ పూజ హెగ్డే కు… అల్లు అర్జున్ సినిమాలతోనే మంచి పాపులారిటీ వచ్చింది. అల్లు అర్జున్ మరియు పూజ హెగ్డే కాంబినేషన్లో అలా వైకుంఠపురంలో, డీజే లాంటి బంపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అయితే అలా వైకుంఠపురం సినిమా తర్వాత…. హీరోయిన్ పూజ హెగ్డే కి ఇండస్ట్రీలో ఒక్క హిట్టు లేదు.

హిట్టు గురించి పక్కకు పడితే… ఈ బ్యూటీకి అసలు ఇండస్ట్రీలో ఛాన్సులు కూడా ఇవ్వడం లేదు దర్శక నిర్మాతలు. గుంటూరు కారం సినిమాలో కొన్ని సీన్స్ చేసిన తర్వాత కూడా హీరోయిన్ పూజ హెగ్డేను తప్పించారు. అంతలా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ పూజ హెగ్డే కు వ్యతిరేకత ఉంది. అయితే ప్రస్తుతం పూజ హెగ్డే కెరీర్ నాశనం కావడానికి కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ హీరో కారణమని చెబుతున్నారు.

ఆ కోలీవుడ్ హీరో సినిమాలో పూజ హెగ్డే నటించింది. అయితే ఆ సినిమా అట్టర్ ఫ్లాఫ్ అయింది. అప్పటినుంచి హీరోయిన్ పూజ హెగ్డే కు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఛాన్సులు రావడంలేదని ఆమె ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తున్నారు. అతని వల్ల పూజా హెగ్డే కెరీర్ నాశనమైందని అంటున్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు