Anil ravipudi: హీరోగా అనిల్ రావిపూడి.. డైరెక్టర్ ఎవరంటే..?

Anil ravipudi.. ప్రస్తుత కాలంలో చాలామంది ఒకే జానర్ లో సినిమాలు చేయకుండా.. వివిధ జానర్లలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు హీరోలే కాకుండా కమెడియన్లు, డైరెక్టర్లు కూడా హీరోలుగా మారి తమలోని టాలెంట్ ను బయటకు తీస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఫ్లాప్ అంటూ చవిచూడని డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి.. ఇప్పుడు హీరోగా అవతారం ఎత్తనున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..ఈ సినిమా పూర్తి అయిన వెంటనే అనిల్ రావిపూడి.. కే రాఘవేంద్రరావు నిర్మాణం లో హీరోగా ఒక సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇక దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది.

Anil ravipudi:Anil Ravipudi as the hero. Who is the director?
Anil ravipudi:Anil Ravipudi as the hero. Who is the director?

హీరోగా అనిల్ రావిపూడి..

ప్రస్తుతం అనిల్ రావిపూడి హీరోగా అవతారం ఎత్తినట్లు తెలుస్తోంది. ప్రముఖ సీనియర్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు నిర్మాణంలో అనిల్ రావిపూడి హీరోగా అవతారం ఎత్తనున్నట్లు సమాచారం. మరి దర్శకుడు ఎవరు అన్న విషయంపై ఇంకా ప్రకటన వెలువడలేదు. త్వరలోనే పూర్తి వివరాలు వెలువడనున్నట్లు సమాచారం.

అనిల్ రావిపూడి కెరియర్..

తెలుగు సినీ రచయితగా.. కెరియర్ మొదలుపెట్టిన ఈయన దర్శకుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.. రచయితగా కందిరీగ , మసాలా, ఆగడు వంటి సినిమాలకు పనిచేసిన ఈయన.. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితో సినీ రంగం వైపు అడుగులు వేశారు.. ఇక ఇతని బాబాయి అరుణ్ ప్రసాద్ కూడా సినీ దర్శకుడే… పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాకి అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించారు.

- Advertisement -

దర్శకత్వంలో మెలుకువలు..

అరుణ్ ప్రసాద్ దగ్గర దర్శకత్వ విభాగంలో మెలుకువలు నేర్చుకున్న అనిల్ రావిపూడి.. ఆ తర్వాత 2005లో విడుదలైన గౌతమ్ ఎస్.ఎస్.సీ చిత్రానికి సహాయకుడిగా కూడా పనిచేశారు.

దర్శకుడిగా అడుగులు..

దర్శకుడిగా అనిల్ మొదటిసారి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన పటాస్ సినిమాతో దర్శకుడిగా మారారు.. అయితే ఈ సినిమా కథను ముందుగా ఎన్టీఆర్ కి వినిపించగా.. ఆయన కళ్యాణ్ రామ్ కి ఈ కథ సరిపోతుందని సూచించారట.. అలా పటాస్ సినిమాతో మొదటి సినిమాకు దర్శకత్వం వహించి భారీ పాపులారిటీ దక్కించుకున్నారు.. తర్వాత సాయి ధరంతేజ్ హీరోగా నటించిన సుప్రీం సినిమాకి కూడా దర్శకత్వం వహించారు.. ఇక 2017లో రవితేజ హీరోగా నటించిన రాజా ది గ్రేట్ సినిమా కి కూడా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించడం గమనార్హం.

అనిల్ రావిపూడి సినిమాలు..

2020లో సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈయన 2023లో భగవంత్ కేసరి సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాలో బాలయ్యను ఒక డిఫరెంట్ పాత్రలో చూపించి సక్సెస్ అయిన అనిల్ రావిపూడి తో సినిమాలు చేయడానికి హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే.

అనిల్ రావిపూడి అందుకున్న అవార్డ్స్..

2021 సెప్టెంబర్ 17న హైదరాబాదులోని జే.ఆర్.సీ. కన్వెన్షన్ హాల్లో జరిగిన సాక్షి మీడియా 2020 ఎక్స్ లెన్స్ అవార్డుల కార్యక్రమంలో ఎఫ్2 సినిమాకి గానూ మోస్ట్ పాపులర్ డైరెక్టర్గా అవార్డు దక్కించుకున్నారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు