The Wedding Guest Telugu Review : బాలయ్య హీరోయిన్ రాధిక ఆప్టే నగ్నంగా నటించిన మూవీ ఓటీటీలోకి వచ్చేసింది… ఎలా ఉందంటే..?

The Wedding Guest Telugu Review : బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆర్జీవి తెరకెక్కించిన రక్త చరిత్ర మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ బాలయ్యతో లెజెండ్ లయన్ వంటి సినిమాల్లో నటించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ తో కబాలి మూవీలో మెరిసింది. సినిమాల కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ నటించిన ఒక బోల్డ్ మూవీ దాదాపు 5 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. తాజాగా నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన ది వెడ్డింగ్ గెస్ట్ అనే హాలీవుడ్ మూవీలో రాధికా ఏకంగా న్యూడ్ గా నటించి వార్తల్లో నిలిచింది.

చాలా కాలం క్రితం ఈ బ్యూటీ న్యూడ్ గా ఉన్న హాట్ సీన్ ఒకటి లీకై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అదే ఇప్పుడు ఓటిటిలో ఉన్నట్టుండి ప్రత్యక్షమైన ది వెడ్డింగ్ గెస్ట్. 2019లో రిలీజ్ అయిన ఈ మూవీలో రాధిక ఆప్టే, దేవ్ పటేల్ హీరో హీరోయిన్లుగా నటించారు. బ్రిటిష్ అమెరికన్ మూవీగా తెరకెక్కిన ది వెడ్డింగ్ గెస్ట్ కు మైకేల్ వింటర్ బాటమ్ దర్శకత్వం వహించారు.

స్టోరీ లోకి వెళ్తే… జై అనే బ్రిటిష్ అబ్బాయి పాకిస్తాన్ లో ఉండే సమీరాను, ఇండియాలో ఉండే దీపేష్ ను కలిపే కాంట్రాక్ట్ కు సైన్ చేస్తాడు. అందులో భాగంగానే ఆయన పాకిస్తాన్ కి వెళ్లి సమీరాను ఇండియాకు తీసుకొస్తాడు. ఆ క్రమంలో జై వాచ్ మెన్ ను మర్డర్ చేయాల్సి వస్తుంది. అలాగే సమీరాను కిడ్నాప్ చేశారనే న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో దీపేష్ ఇదంతా ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందో అనే భయంతో సమీరాను తిరిగి అక్కడే వదిలేసి వస్తే కావాల్సినన్ని డబ్బులు ఇస్తానని జైకు చెప్తాడు.

- Advertisement -

అయితే సమీరా జైతో దీపేష్ దగ్గర వజ్రాలు ఉన్నాయని, వాటిని తీసుకునే తామిద్దరం దేశం దాటి పారిపోవాలనుకున్నామని చెప్తుంది. ఆ తర్వాత దీపేష్ దగ్గరకు చేరుకుంటారు వీరిద్దరు. ఆ వజ్రాలు ఎవరు దక్కించుకున్నారు? ఈ లోపు జై, సమీరా మధ్య ఏం జరిగింది? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. ఇక సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్, ఇంటిమేట్ సన్నివేశాలు గట్టిగానే ఉంటాయి. ఆ లీక్ అయిన సన్నివేశాలపై అప్పట్లో రాధికా సీరియస్ అయ్యింది. ఇక ఇంత బోల్డ్ గా నటించే ధైర్యం చేసినా ఈ మూవీ వల్ల రాధికాకు ఒరిగిందేమీ లేదు.

ప్రస్తుతం ఈ మూవీ హిందీ ఇంగ్లీష్ తో పాటు తెలుగులో కూడా అందుబాటులో ఉంది. రాధిక ఆప్టే నూలు పోగు లేకుండా నటించిన ఈ మూవీ ప్రస్తుతం నేషనల్ వైడ్ గా టాప్ 2లో ట్రెండింగ్ అవుతుండడం విశేషం. అయితే మూవీ యావరేజ్ అయినప్పటికీ రాధిక ఆప్టే బోల్డ్ సీన్స్ తో జనాల్ని అట్రాక్ట్ చేస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీనీ చూసేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు