OTT Movies on Lord Srirama : ఓటిటిలో మిస్ అవ్వకుండా చూడాల్సిన రాముడి సినిమాలివే

OTT Movies on Lord Srirama : ఈరోజు అంటే ఏప్రిల్ 17న శ్రీరామ నవమి సెలెబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పూజలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు శ్రీ రాముడి భక్తులు. ఇక సినీ ప్రియులు ఓటిటిలో ఫ్యామిలీతో కలిసి శ్రీరాముడి సినిమాలను చూస్తూ ఈరోజును సరదాగా గడపాలని కోరుకుంటున్నారు. ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లాంటి ఓటిటిల్లో తెలుగుతో పాటు వివిధ భాషల్లో వచ్చిన రాముడి సినిమాలెన్నో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రత్యేక శుభదినం రోజున ఓటిటిలో రాముడిపై ఇప్పటి దాకా వచ్చిన తెలుగు సినిమాలపై ఓ లుక్కేద్దాం పదండి.

1. సంపూర్ణ రామాయణం

బాపు దర్శకత్వంలో రూపొందిన అద్భుతమైన మూవీ సంపూర్ణ రామాయణం. ఈ దృశ్య కావ్యంలో ఎన్టీఆర్ రాముడిగా కనిపించగా, ప్రస్తుతం సంపూర్ణ రామాయణం మూవీ యూట్యూబ్ తో పాటు ఈటీవీ విన్ యాప్ లో అందుబాటులో ఉంది. సంపూర్ణ రామాయణం మాత్రమే కాకుండా ఇదే పేరుతో వచ్చిన మూడు సినిమాలు కూడా యూట్యూబ్ లో ఫ్రీగానే చూసే ఛాన్స్ ఉంది. ఇక ఎన్టీఆర్ లో రాముడిని చూసుకునే అభిమానులు ఈ మూవీ చూస్తూ హ్యాపీగా రామ నామ జపంలో మునిగిపోవచ్చు.

2. లవకుశ

తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన లవకుశ మూవీని శ్రీరామ నవమి సందర్భంగా ప్రైమ్ వీడియో, సన్ నెక్స్ట్ ఓటిటిలో చూడొచ్చు. 60 ఏళ్ల కిందట వచ్చిన ఈ ఎవర్ గ్రీన్ మూవీ ఇంకా చాలా మంది ఫేవరెట్ మూవీస్ లిస్ట్ లో ఉంది. ఇంకెన్నేళ్ళు గడిచినా లవ కుశ మూవీకి తెలుగు పేక్షకుల మదిలో ఆదరణ తగ్గేలా లేదు.

- Advertisement -

3. బాల రామాయణం

కేవలం పిల్లలతోనే ప్రత్యేకంగా రూపొందించిన మూవీ బాల రామాయణం. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ రాముడిగా కనిపించి మెప్పించారు. ఈ మూవీని కూడా యూట్యూబ్ లో ఫ్రీగా వీక్షించొచ్చు. ఇంకెందుకు ఆలస్యం తారక్ ఫ్యాన్స్ అంతా ఈ మూవీపై ఓ లుక్కెయ్యండి మరి.

4. శ్రీరామరాజ్యం

ఒకప్పుడు రాముడు అంటే నందమూరి తారక రామారావు గుర్తొచ్చేవారు. కానీ నేటితరం యూత్ కు రాముడు అనగానే బాలకృష్ణ గుర్తొస్తారు. ముఖ్యంగా ఆయన నటించిన శ్రీరామ రాజ్యం మూవీ గుర్తొస్తుంది. బాపు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రామాయణంలోని ఉత్తరకాండ ఆధారంగా తెరపైకి వచ్చింది. నయనతార సీతగా కనిపించిన ఈ మూవీ ప్రైమ్ వీడియోలో, జి 5లో స్ట్రీమింగ్ అవుతోంది.

6. ఆది పురుష్

నేటి తరం పిల్లలకు బాల రామాయణం, లవకుశ వంటి సినిమాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఆదిపురుష్ మాత్రం అందరికీ తెలుసు. ఎందుకంటే బాహుబలి నటించిన మూవీ కాబట్టి. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ గతేడాది రిలీజ్ అయ్యి డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. వీటితో పాటు మరెన్నో రామాయణం ఆధారంగా రూపొందిన సినిమాలు ఓటిటిల్లో, యూట్యూబ్ లో ఫ్రీగానే అందుబాటులో ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు