Sri Sathya: పెళ్లికి సిద్ధమైన బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Sri Sathya.. తెలుగు బుల్లితెర ఛానల్ పై బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు సంపాదించుకున్న బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ షో ద్వారా ఎంతో మంది భారీ పాపులారిటీ సొంతం చేసుకుని.. సినిమాలలో , సీరియల్స్ లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు.. ఇకపోతే బిగ్ బాస్ ద్వారా భారీ క్రేజ్ సొంతం చేసుకున్న వారిలో శ్రీ సత్య కూడా ఒకరు.. బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె తన కష్టాలను చెప్పి ఆడియన్స్ సానుభూతి పొందింది. మరోవైపు ఈమె తన ఆటతీరుతో , అందంతో అందరిని ఫిదా చేసింది.. దీంతో ఆమెను టాప్ 5 వరకు తీసుకొచ్చారు ఆడియన్స్..

Sri Sathya:Bigg Boss beauty ready for marriage..do you whose her piancy..!
Sri Sathya:Bigg Boss beauty ready for marriage..do you whose her piancy..!

పెళ్లి పీటలు ఎక్కనున్న శ్రీ సత్య..

ఒకప్పుడు బిగ్ బాస్ షోలో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ తర్వాత పలు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీ అయిపోయింది.. అంతేకాదు పలు షోలలో డాన్స్ చేస్తూ మరికొన్ని షోలలో ఎంటర్టైన్ చేస్తూ ఆడియన్స్ కి దగ్గరగా ఉంది శ్రీ సత్య.. ఇది ఇలా ఉండగా తాజాగా శ్రీ సత్య కి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారుతోంది. అంతేకాదు ఈమె త్వరలో పెళ్లి చేసుకోబోతోంది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈమె ప్రముఖ సీరియల్ నటుడు పవన్ రవీంద్ర ను వివాహం చేసుకోబోతుందని సమాచారం.. ప్రస్తుతం వీరిద్దరూ ఎప్పటినుంచో ప్రేమలో ఉన్నారు అని .. చాలామంది బుల్లితెర సీరియల్ నటుల సైతం తెలియజేస్తూ వచ్చారు.. అంతేకాదు వీరు కలిసి ఉన్న కొన్ని ఫోటోలు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి .. అయితే వీరిద్దరూ ఒక ఈవెంట్ లో కలుసుకున్నారని , అప్పటి నుంచే ప్రేమలో ఉన్నారని.. తాజాగా ఈ జంట కూడా రివీల్ చేసింది.. ఇకపోతే శ్రీ సత్య తన లైఫ్ లో ఎన్నో స్ట్రగుల్స్ అలాగే బాధలను, కష్టాలను ఎదుర్కొని ఇప్పుడు రవీంద్ర తో ప్రేమలో ఉందని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని సమాచారం..

అప్పటికే బ్రేకప్:

శ్రీ సత్య గతంలో ఒకసారి ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.. ఆ తర్వాత ఇద్దరి మధ్య కొన్ని గొడవలు, కలహాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. అయితే తన జీవితంలో జరిగిన ఇంతటి విషాద బాధాకరమైన విషయాన్ని శ్రీ సత్య బిగ్ బాస్ లోకి వచ్చినప్పుడు ప్రతిసారీ చెబుతూ బాధపడుతూ ఉండేది. ఈ నేపథ్యంలోని ఈ అంశం ఈమెకు బిగ్ బాస్ హౌస్ లో బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పుడు తన సెకండ్ లవ్ గురించి కూడా బయట పెట్టేసింది.. ఫైనల్గా తాను ప్రేమించిన సీరియల్ హీరో పవన్ రవీంద్ర ను వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యింది.. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదు కానీ ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. మొత్తానికైతే ఒకప్పుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న శ్రీ సత్య ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతోంది. ఇకనైనా ఈమె జీవితం బంగారమయం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు