Pushpa 2 Producer Arrest : కిడ్పాప్ కేసులో పుష్ప 2 నిర్మాత.. అరెస్ట్‌కు అంతా రెడీ..?

Pushpa 2 Producer Arrest : అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2 సినిమా రిలీజ్ సిద్దమవుతుంది. ఆగస్ట్ 15న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా వచ్చిన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే 110 మిలియన్ వ్యూస్ వచ్చాయి ఆ టీజర్ కు. అంతా సవ్యంగా ఉంది అనుకునే టైంలో పుష్ప 2 టీంకు ఊహించని విధంగా కష్టాలు వచ్చి పడ్డాయి. ఈ సినిమా నిర్మాత నవీన్ ఎర్నేని అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. పోలీసులు ఈ నిర్మాతను అరెస్ట్ చేయ్యడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. అసలు ఈ కేసు ఏంటి..? నవీన్ యెర్నేని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే…?

పుష్ప సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు. 2021లో రిలీజ్ అయిన ఈ మూవీకి 380 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 వస్తుంది. దీన్ని కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో నవీన్ ఎర్నేని ఒక నిర్మాత. ఇతని మెడ చూట్టు ఇప్పుడు ఓ పాత కేసు చుట్టుకుంది. ఈ కేసులో భాగంగా నిర్మాత నవీన్ ఎర్నేని అరెస్ట్ అయ్యే అవకాశం ఉందట.

కేసు ఏంటంటే..?

2018లో కిడ్నాప్ కేసుకు సంబంధించి పుష్ప 2 నిర్మాత నవీన్ ఎర్నేని తో పాటు పలువురు ఎన్ అర్ ఐ ల మీద జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసు. మాజీ టాస్క్ ఫోర్స్ డీ సీ పీ రాధా కిషన్ రావు సాయంతో నిర్మాత నవీన్ ఎర్నేని క్రియా హెల్త్ కేర్ అనే సంస్థని లాక్కున్నట్లు చెన్నుపాటి వేణుమాధవ్ అనే వ్యాపారి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పుష్ప నిర్మాత నవీన్ ఎర్నేని పాత్రపై ఆధారాలు లభ్యమయ్యాయని సమాచారం. దీంతో పోలీసులు నవీన్ ఎర్నేనిని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందట. ఆగస్టులో సినిమా రిలీజ్ అవుతుందన్న టైంలో నిర్మాతపై కేసు, అరెస్ట్ వరకు వెల్లడం అనేది సినీ వర్గంలో చర్చనీయాంశంగా మారిపోయింది.

- Advertisement -

గతంలో ఓ అరెస్ట్…

పుష్ప 2 టీం కు ఇలా జరగడం కొత్తేమీ కాదు. కొన్ని రోజుల క్రితం పుష్ప సినిమాలో  కేశవా క్యారెక్టర్ చేసిన జగదీష్ ఓ కేసులో అరెస్ట్ అయ్యాడు. సినిమాలో అతనిది మెయిన్ రోల్ కావడంతో పుష్ప 2 నిర్మాతలు చొరవ తీసుకుని జగదీష్ ను బెయిల్ పైన బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు అదే నిర్మాత కిడ్నాప్ కేసులో ఇరక్కొని జైలుకు వెళ్లడానికి రెడీ అయిపోయాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు