Varalakshmi Sarathkumar : నేను పెళ్లి చేసుకోవాలనుకోలేదు.. కానీ ఈ ఏడాదే నా పెళ్లి జరుగుతుంది

Varalakshmi Sarathkumar : శరత్ కుమార్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. 2012లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ నటి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది. మొదట్లో హీరోయిన్ గా కొన్ని సినిమాలలో నటించిన వరలక్ష్మి ఆ తరువాత విలన్ పాత్రలు, విభిన్నమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇటీవల టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన హనుమాన్ చిత్రంలో హీరో అక్క పాత్రలో కనిపించి మెప్పించింది.

ఇక త్వరలోనే “శబరి” అనే ఓ లేడీ ఓరియంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. ఈ నటి త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది. మార్చ్ 1న ఎలాంటి హడావిడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది వరలక్ష్మి. ఇండస్ట్రీకి సంబంధం లేని గ్యాలరిస్ట్ నికోలాయి సచ్ దేవ్ తో నిశ్చితార్థం చేసుకుంది. వీరిద్దరికీ గత 14 ఏళ్ల నుంచి మంచి పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. 38 ఏళ్ల వయసులో వరలక్ష్మి ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసుకుంది.

అయితే ఇటీవల ఆమె నటించిన శబరి మూవీ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు వరలక్ష్మి. ” నేను జీవితంలో పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. ఇప్పుడు జరిగిపోతుంది. నా జీవితంలో పెళ్లి అనేది ఓ సర్ప్రైజ్. నా పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఒకవేళ పెళ్లి డేట్ ఫిక్స్ అయితే మాత్రం కచ్చితంగా నేనే మీడియాకు అధికారికంగా తెలుపుతా. వివాహం తర్వాత కూడా నా కెరీర్ నీ కొనసాగిస్తా” అంటూ చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు