Shyamala: నా భర్త బలవంతంగా అందులో తోసేశారు..!

Shyamala.. ప్రముఖ స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం , అభినయంతో పాటూ మాటతీరుతో అందరినీ కట్టిపడేసి వరుస షోలు చేస్తూ దూసుకుపోతోంది.. సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె మరొకవైపు లయ, అభిషేకం, గోరింటాకు వంటి సీరియల్స్ లో కూడా నటించి మెప్పించింది.. ఒకవైపు స్టార్ యాంకర్ గా మరొకవైపు సినిమాలలో సీరియల్స్ లో వరుస అవకాశాలు అందుకుంటూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న శ్యామల.. నటుడు నరసింహా ను ప్రేమించి మరీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. అప్పట్లో ఈమె ప్రేమాయణం పెళ్లి ఒక సంచలనం సృష్టించాయి.. ఇక పెళ్లి తర్వాత వీరికి ఒక బాబు కూడా జన్మించారు.. ప్రస్తుతం పలు బుల్లితెర షోలు , పండుగ స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన భర్త పై చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Shyamala: My husband forced me into that profession..
Shyamala: My husband forced me into that profession..

బలవంతంగా తోశారు..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్యామల ఆసక్తికర కామెంట్లు చేసింది. నాకు యాంకర్ గా చేయాలని ఆసక్తి లేదు.. కానీ నా భర్త పదేపదే చెప్పి మరీ యాంకరింగ్ లోకి నన్ను తోసాడు.. అలా యాంకరింగ్ లోకి వచ్చిన నాకు కొంచెం దానిపై ప్రేమ పెరిగింది.. ఆయన ఎక్కించిన ఆ డ్రగ్ వల్ల ఇప్పుడు యాంకరింగ్ లేకపోతే ఉండలేని పరిస్థితికి నేను చేరుకున్నాను.. ముఖ్యంగా నా భర్తే యాంకరింగ్ అనే డ్రగ్ ఎక్కించారు అంటూ చెప్పుకొచ్చింది.. ఇకపోతే డ్రగ్ అనే పదం వాడడంతో ఇప్పుడు యాంకర్ శ్యామల చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా కొందరు రకరకాల థంబ్ నెయిల్స్ పెట్టి మరీ శ్యామల వీడియోని నెట్టింట షేర్ చేస్తూ మరింత వైరల్ చేస్తున్నారు.

మోడ్రన్ లుక్స్ లో అదరహో..

యాంకర్ శ్యామల ఈమధ్య కాలంలో మోడ్రన్ లుక్స్ లో అందరిని అలరిస్తోంది అని చెప్పవచ్చు.. తనదైన శైలిలో రకరకాల దుస్తులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అందచందాలతో భారీ క్రేజ్ కూడా సొంతం చేసుకుంది. ఒకవైపు సినిమాలలో అవకాశాలు అందుకుంటూనే మరొకవైపు సోషల్ మీడియాలో అభిమానులను పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాదు సమాజంలో జరిగే అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటుంది.
ఈ క్రమంలోనే తాజాగా మొన్న ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయి దాడి గురించి కూడా స్పందించింది శ్యామల.

- Advertisement -

జగన్ పై దాడి.. శ్యామల ఫైర్..

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేస్తుండగా జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన విషయం తెలిసిందే.. తాజాగా ఈ ఘటనపై యాంకర్ శ్యామల రియాక్ట్ అవుతూ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడి చాలా బాధాకరం.. ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయి అన్న నమ్మకానికి ఇలాంటి సంఘటనలు మరింత ఇబ్బందిని కలిగిస్తాయి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము అంటూ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు