Teja Sajja New Movie Title : తేజ సజ్జ – కార్తీక్ ఘట్టమనేని కాంబో మూవీ నుంచి లీక్… టైటిల్ ఇదే

Teja Sajja New Movie Title : యంగ్ హీరో తేజ సజ్జ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ తో ఈ హీరో క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్డమ్ తెచ్చుకున్నాడు ఈ హీరో. చిన్నప్పటినుండి సినిమాలలో నటిస్తూ మనల్ని మెప్పించిన తేజ హీరోగా మారి వరుసగా కొత్త కొత్త కథలతో సినిమాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. జాంబిరెడ్డి సినిమాతో హీరోగా పరిచయమైన తేజ.. ఆ తర్వాత చేసిన రెండు ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు.

ఇటీవల హనుమాన్ సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టడంతో తేజ చేస్తున్న తర్వాతి సినిమాలపై మంచి బజ్ క్రియేట్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఓ మూవీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీని డిఫరెంట్ కాన్సెప్ట్ తో, భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కార్తీక్ ఘట్టమనేని – తేజ సజ్జ కాంబోలో రాబోయే మూవీ గురించి ఇప్పుడు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ గురించి గత కొంతకాలంగా టాలీవుడ్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాకి “మిరాయి” అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. మిరాయి అంటే తెలుగు పదం కాదు. జపనీస్ లో మిరాయి అంటే భవిష్యత్తు అని అర్థం. సినిమా లైన్ కి తగ్గట్టుగా ఈ పదాన్ని టైటిల్ గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ టైటిల్ ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు