Jr NTR : మరోసారి ఖరీదైన వాచ్ తో కనిపించిన తారక్.. ధరెంతో తెలిస్తే షాక్..!

Jr NTR : ఈ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత వివిధ రంగాలలోని సెలబ్రిటీలంతా ఎటువంటి దుస్తులు ధరించినా, ఏ బ్రాండ్ షూ ధరించినా, ఎలాంటి వాచ్ పెట్టుకున్నా, గోల్డ్, రింగ్స్ అవన్నీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ గురించి ఓ న్యూస్ వైరల్ గా మారింది. నేటితరం యువత వాచ్ లని ధరించడానికి ఆసక్తి చూపించడం లేదు కానీ.. సెలబ్రిటీలు మాత్రం ఖరీదైన వాచ్ లను కొనుగోలు చేస్తూ ఆ వాచ్ ల కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఇక ఈ మధ్య తారక్ ఎక్కడికి వెళ్లినా కొత్త వాచ్ తో దర్శనమిస్తూ ట్రెండ్ అవుతూనే ఉన్నాడు. తారక్ కి వాచ్ లు అంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర భారీ వాచ్ కలెక్షన్ ఉంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇదిలా ఉంటే.. తాజాగా “వార్ 2” మూవీ షూటింగ్ కోసం తారక్ ముంబై వెళుతున్న సమయంలో ఆయన ధరించిన వాచ్ ధర గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

- Advertisement -

ఎన్టీఆర్ ఒక బ్లూ కలర్ ఫుల్ హాండ్స్ షర్ట్ ధరించి, క్యాప్ ధరించి కనిపించారు. ఆయన స్టైలిష్ గాగుల్స్ లుక్ ని మరింత ఎలివేట్ చేసేలా ఉన్నాయి. ఇక ఆయన ధరించిన “Richard Mille” వాచ్ ధర ఎంత ఉంటుందని ఇంటర్నెట్ లో సెర్చ్ చేసినవారు ఖంగుతింటున్నారు. తారక్ ధరించిన వాచ్ విలువ 8.2 కోట్లు ఉంటుందని సమాచారం. ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకునే తారక్.. 8.2 కోట్లతో వాచ్ కొనుగోలు చేయడంలో ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు