90s Web Series : 90s వెబ్ సిరీస్ ను ఊహించని రేంజ్ లో క్యాష్ చేసుకున్న ఓటిటి… సిరీస్ ఒక్కటే లాభాలు రెండు

90s Web Series : చాలా గ్యాప్ తర్వాత హీరో శివాజీ 90s వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సిరీస్ ద్వారా దానిని ప్రసారం చేసిన ఓటిటి సంస్థ ఈటీవీ విన్ కు ఊహించని రేంజ్ లో క్యాష్ చేసుకున్నట్టు సమాచారం. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఒకే వెబ్ సిరీస్ తో రెండు రకాలుగా లాభాలు తన ఖాతాలో వేసుకుంది ఈటీవీ విన్.

కోట్లలో లాభాలు…

చాలా గ్యాప్ తర్వాత శివాజీ బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు రియాల్టీ షో ద్వారా తెరపైకి వచ్చి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత 90s వెబ్ సిరీస్ ద్వారా ఓటిటిలోకి అడుగు పెట్టాడు. శివాజీ, వాసుకి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ కు నవీన్ మేడారం దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ను ఎంఎంఓపి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజశేఖర్ మేడారం నిర్మించారు. మధ్యతరగతి కుటుంబంలోని స్థితిగతులు, వాళ్లు ఎదుర్కొనే సమస్యలను, సామాజిక ఒత్తిడి, నమ్మకాలు వంటి అంశాలను కలగలిపి ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఇందులో 90s కాలం నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అందుకే అప్పటి కిడ్స్ బాగా కనెక్ట్ అయ్యారు.

ఊహించని విధంగా 90s వెబ్ సిరీస్ కు అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. జనవరి 5న ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అయింది. అయితే ఈ వెబ్ సిరీస్ రైట్స్ ను దక్కించుకున్న ఈటివి విన్ ఓటిటి సంస్థకు భారీగా కాసుల వర్షం కురిసినట్టుగా తెలుస్తోంది. 2.2 కోట్లకు 90s వెబ్ సిరీస్ రైట్స్ ను ఈటీవీ దక్కించుకోగా, అద్భుతమైన ప్రేక్షక ప్రేక్షకాదరణ చూరగొన్న ఈ వెబ్ సిరీస్ వల్ల వాళ్లకు 8 కోట్లకు పైగా లాభాలు వచ్చాయని సమాచారం.

- Advertisement -

ఊహించని రేంజ్ లో సబ్ స్క్రిప్షన్స్

ఒక్క దెబ్బతో రెండు పిట్టలు అన్నట్టుగా వెబ్ సిరీస్ ఒక్కటే అయినా దానివల్ల రెండు విధాలుగా లాభ పడ్డారట ఈటీవి విన్ సంస్థ వారు. కోట్లలో లాభాలను జేబులో వేసుకోవడమే కాదు అంచనా వేయలేనన్ని సబ్ స్క్రిప్షన్స్ కూడా వచ్చాయట. ఆ లెక్క ఎంతన్నది ఇంకా తెలియరాలేదు. కానీ మొత్తానికి ఈటీవీ విన్ ఓటీటి పోటీలో మంచి స్థానాన్ని దక్కించుకోవడానికి 90s వెబ్ సిరీస్ బాగానే హెల్ప్ అయ్యింది.

ఇక ఈ మూవీలో శివాజీ భార్యగా వాసుకి కనిపించింది. గతంలో ఆమె పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలిప్రేమ మూవీలో ఆయన చెల్లెలి పాత్రను పోషించింది. ఇక యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయిన మౌళి తనూజ్ శివాజీ కొడుకుగా నటించాడు. అతనికి ఈ సినిమా ద్వారా మంచి క్రేజ్ దక్కింది. మొత్తానికి 90s వెబ్ సిరీస్ నటీనటులతో పాటు ఆ మూవీని కొనుగోలు చేసిన ఓటీటి సంస్థకు కూడా పెద్ద మేలే చేసింది. ఇక ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన సీక్వెల్ గురించి తెలుగు సినీ ప్రియులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు