Aishwarya Shankar : రెండో పెళ్లి చేసుకున్న స్టార్ డైరెక్టర్ కూతురు

Aishwarya Shankar : స్టార్ డైరెక్టర్ శంకర్ రెండవ కూతురు ఐశ్వర్య శంకర్ రెండవ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. శంకర్ తన దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పని చేస్తున్న తరుణ్ కార్తికేయన్ అనే కుర్రాడికి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడు. చెన్నై వేదికగా సోమవారం జరిగిన ఈ వేడుకకు తమిళ స్టార్ హీరోలు చాలామంది హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

గతంలో ఐశ్వర్య శంకర్ కి రోహిత్ అనే ఓ క్రికెటర్ తో 2021 కరోనా సమయంలో ఘనంగా వివాహం జరిగింది. అయితే రోహిత్ పై ఫోక్సో కేసు నమోదు కావడం, అతను పలు వివాదాలలో నిలవడంతో పెళ్లయిన కొన్ని నెలలకే వీరు పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఇక తరుణ్ కార్తికేయన్ తో ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరగగా.. నేడు ఘనంగా వివాహం జరిగింది. వీరి వివాహానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తీ, విక్రమ్, నయనతార, మణిరత్నం లతోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

శంకర్ చిన్న కూతురు, నటి అదితి శంకర్ తన సోదరి వెడ్డింగ్ కి సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకోవడంతో వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక శంకర్ ప్రస్తుతం రెండు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న గేమ్ చేంజర్, కమల్ హసన్ హీరోగా తెరకెక్కుతున్న భారతీయుడు 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు. భారతీయుడు 2 సినిమా జూన్ లో విడుదల కానుండగా.. గేమ్ చేంజర్ అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు