Disco Shanthi Comments on Srihari death : తాగడం వల్ల చనిపోలేదు… శ్రీహరి మరణం వెనకున్న సీక్రెట్ బయట పెట్టిన డిస్కో శాంతి

Disco Shanthi Comments on Srihari death : రియల్ స్టార్ శ్రీహరి హఠాన్మరణం టాలీవుడ్ ను తేరుకోలేని షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే. ఆయన మరణానికి కారణం శ్రీహరికి ఉన్న తాగుడు అలవాటే అంటూ వస్తున్న వార్తలపై తాజాగా డిస్కో శాంతి వెల్లడించింది. బిగ్ టీవీ ఫ్రాంక్లీ స్పీకింగ్ లో సురేష్ కొండేటితో మాట్లాడిన డిస్కో శాంతి ఆయన తాగడం వల్ల చనిపోలేదు అంటూ శ్రీహరి మరణం అనుకున్న సీక్రెట్స్ ని బయట పెట్టింది.

తాగడం వల్ల ఆయన చనిపోలేదు…

ఆర్ రాజకుమార్ మూవీ షూటింగ్ కోసం ముంబై వెళ్ళిన సమయంలో శ్రీహరి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను లీలావతి ఆసుపత్రికి తరలించారు చిత్ర బృందం. అయితే లివర్ కు సంబంధించిన సమస్యతో ఆయన చికిత్స పొందుతూ అక్కడే మరణించారు. అయితే ఆ ముంబై వాళ్లకు శ్రీహరి ఎవరో తెలియదని, అందుకే సరిగ్గా చికిత్స చేయలేదని కొన్ని ఇంటర్వ్యూలలో శ్రీహరి భార్య డిస్కో శాంతి చెప్పుకొచ్చారు. నోట్లో నుంచి ట్యూబ్ వేయడం వల్ల అది లివర్లో గుచ్చుకుందని, దీంతో బ్లడ్ మొత్తం బయటకు వచ్చి ఆయన మరణించారని వెల్లడించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా బిగ్ టీవీ ఫ్రాంక్లీ స్పీకింగ్ లో సురేష్ కొండేటితో డిస్కో శాంతి మాట్లాడుతూ శ్రీహరి మరణంపై వచ్చిన రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టారు. శ్రీహరికి బాగా తాగే అలవాటు ఉందని, దానివల్లే లివర్ చెడిపోయి ఆయన చనిపోయారని ప్రచారం జరిగింది. అయితే తాజా ఇంటర్వ్యూలో డిస్కో శాంతి శ్రీహరి తాగడం వల్ల చనిపోలేదని, ఆయన చనిపోయే మూడేళ్ల ముందే పూర్తిగా ఆల్కహాల్ మానేసాడు అంటూ ఇప్పటిదాకా ఎవ్వరికీ తెలియని సీక్రెట్ ను బయట పెట్టింది.

- Advertisement -

ఎవ్వడూ పట్టించుకోవడం లేదు…

ఇక ఈ సందర్భంగా డిస్కో శాంతి మాట్లాడుతూ శ్రీహరి బ్రతికి ఉన్నప్పుడు ఎలా ఉండేది, చనిపోయాక ఏం మారింది అనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చింది. శ్రీహరి ఉన్నప్పుడు ఇల్లు మొత్తం సందడిగా ఉండేదని, ముఖ్యంగా మార్నింగ్ టైంలో పొలిటికల్ లీడర్స్, సాయంత్రం 5 తర్వాత సినిమా వాళ్లు వచ్చే వాళ్ళని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ఇంటి ముందు కార్లతో రోడ్డు మొత్తం బ్లాక్ అయ్యేదని, ఆయన చనిపోయాక మాత్రం ఎవ్వడూ పట్టించుకోవడం లేదని, కనీసం ఇంటి వైపు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

దొంగతనంగా పెళ్లి…

ఇక డిస్కో శాంతి, శ్రీహరి అప్పట్లోనే ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా బిగ్ టీవీ ఫ్రాంక్లీ స్పీకింగ్ లో డిస్కో శాంతి తమ ప్రేమ వివాహం ఎలా జరిగిందనే విషయాన్ని రివీల్ చేసింది. 1992లో ఫస్ట్ తామిద్దరం దొంగతనంగా పెళ్లి చేసుకున్నామని, 1996లో అఫీషియల్ గా మ్యారేజ్ అయిందని వెల్లడించింది. అంతేకాకుండా సాంగ్స్ విషయంలో శ్రీహరి తనను ఏమీ అనేవారు కాదని, నిజానికి తను చిన్న చిన్న డ్రెస్ లు వేసుకుని డాన్స్ చేస్తున్నప్పుడే ఆయన తనను లవ్ చేశాడని గుర్తు చేసుకుంది డిస్కో శాంతి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు