Suhas Remuneration : 60 రెట్లు పెరిగింది… రెమ్యూనరేషన్ ఎంతో చెప్పేసిన సుహాస్

Suhas Remuneration : డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు తీస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్న యంగ్ హీరో సుహాస్. కలర్ ఫోటో మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఫస్ట్ మూవీ కలర్ ఫోటో తోనే బెస్ట్ తెలుగు మూవీగా జాతీయ అవార్డును దక్కించుకున్న ఘనతను సాధించాడు సుహాస్. ఇక రీసెంట్ గా రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాలలో తన నటనకు ప్రశంసలు దక్కించుకున్నాడు. తాజాగా ప్రసన్న వదనం అనే మూవీతో థియేటర్లోకి రాబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే సుహాస్ రెమ్యూనరేషన్ భారీగా పెరిగింది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై సుహాస్ స్పందిస్తూ ఏకంగా తన ఫస్ట్ మూవీ కంటే 60 రెట్లు పెరిగిందని క్లారిటీ ఇచ్చారు. మరి ఇంతకీ సుహాస్ రెమ్యూనరేషన్ ఎంత పెరిగింది ? అంటే…

రెమ్యూనరేషన్ పై క్లారిటీ

సుహాస్ జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్ ను మొదలు పెట్టాడు. అయితే అప్పట్లో ఆయన రోజుకు 100 రూపాయలు పారితోషకంగా అందుకున్నారట. ఆ తర్వాత తన రెమ్యూనరేషన్ 1000 నుంచి 3 కోట్ల రూపాయలు పెరిగిందని ఒకానొక సందర్భంలో చెప్పాడు అంటూ వార్తలు విన్పిస్తున్నాయి. ఇక తాజాగా ప్రసన్న వదనం మూవీ ప్రమోషన్స్ లో సుహాస్ రెమ్యూనరేషన్ గురించి ప్రస్తావన వచ్చింది. పారితోషకం 3 కోట్లు అందుకుంటున్నారట కదా. ఈ సినిమాకి కూడా అంతే తీసుకున్నారా? అనే ప్రశ్నకు సుహాస్ స్పందిస్తూ అవన్నీ కేవలం రూమర్లు మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు.

మరి ఫస్ట్ మూవీకి, ఇప్పుడు ప్రసన్న వదనం మూవీకి ఎంత పారితోషకం అందుకున్నారు అనే ప్రశ్నకు సుహాస్ స్పందిస్తూ… మొదటి మూవీకి ఇప్పటికీ 60 రెట్లు పారితోషకం పెరిగిందని చెప్పారే తప్ప, తన రెమ్యూనరేషన్ ఎంత అనే నెంబర్ చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు. మొత్తానికి సుహాస్ రెమ్యూనరేషన్ వార్తలపై ఇంకా సస్పెన్స్ అలాగే కంటిన్యూ అవుతోంది. దానికి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.

- Advertisement -

సుహాస్ నెక్స్ట్ సినిమాల విషయానికి వస్తే…

పడి పడి లేచే మనసు మూవీతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన సుహాస్ ఆ తర్వాత ప్రతిరోజు పండగే, డియర్ కామ్రేడ్, మజిలీ వంటి సినిమాల్లో కమెడియన్ గా కనిపించాడు. అడవి శేషు హీరోగా నటించిన హిట్ 2 మూవీలో విలన్ గా మెరిసాడు. ప్రస్తుతం సుహాస్ ప్రసన్న వదనం అనే మూవీలో నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు అర్జున్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫేస్ బ్లైండ్ అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఈ మూవీ రాబోతోంది. ఇక వీటితో పాటే ప్రస్తుతం సుహాస్ చేతిలో ఏకంగా ఐదు సినిమాలు ఉన్నాయి. ప్రసన్న వదనంతో పాటు ఆనంద రావు అడ్వెంచర్స్, శ్రీరంగ నీతులు, కేబుల్ రెడ్డి వంటి సినిమాల్లో కనిపించబోతున్నాడు సుహాస్. ఒక్కో సినిమాను ఒక్కోడిఫరెంట్ కాన్సెప్ట్ తో తీసుకొస్తున్నాడు. ఇప్పుడైతే ప్రసన్న వదనం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు