Prakash Raj : ద్వేషానికి వ్యతిరేకంగా మార్పు కోసం… ఓటేసిన ప్రకాష్ రాజ్

Prakash Raj : 2024 లోక్‌సభ ఎన్నికలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 26న 2వ దశ ఓటింగ్ స్టార్ట్ అయ్యింది. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 89 నియోజకవర్గాల్లో ఈరోజు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఏప్రిల్ 19న జరిగిన మొదటి ఫేజ్‌లో మొత్తం 102 స్థానాల్లో పోటీ జరిగింది. ఇక రెండవ దశ ఓటింగ్ లో పాల్గొన్న సీనియర్ నటుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్పెషల్ మెసేజ్ ను కూడా ఇచ్చారు.

ప్రకాష్ రాజ్ ఓటు మెసేజ్..

జాతీయ అవార్డు గ్రహీత నటుడు, రాజకీయ నాయకుడు ప్రకాష్ రాజ్ బెంగళూరులోని పోలింగ్ స్టేషన్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ ఓటు ప్రాముఖ్యతను వివరించారు. “నా ఓటు నా హక్కు. నాకు ప్రాతినిధ్యం వహించేవారిని ఎన్నుకునే నా శక్తిని ఓటు హక్కు సూచిస్తుంది. పార్లమెంటులో నా వాయిస్ విన్పించే అభ్యర్థిని ఎంపిక చేయడం చాలా కీలకం. నేను విశ్వసించే అభ్యర్థికి ద్వేషానికి వ్యతిరేకంగా ఓటు వేశాను. గత దశాబ్దంలో చూసిన విభజన రాజకీయాల మధ్య మార్పును లక్ష్యంగా చేసుకుని వారు అందించిన మ్యానిఫెస్టోకు ఓటు వేశాను. మీరు కూడా మీ ఓటు హక్కును వినియోగించండి” అంటూ పిలుపునిచ్చారు.

2019లో ఓటమి..

ప్రకాష్ రాజ్ బెంగుళూరు సెంట్రల్ నియోజక వర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా, 2019 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్యపై పోటీ చేసి ఓటమిని చవిచూశాడు.

- Advertisement -

7 దశలలో పోలింగ్..

దేశవ్యాప్తంగా 7 దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. తొలి దశలో తమిళనాడు, పుదుచ్చేరి సహా 21 రాష్ట్రాల్లోని 102 నియోజకవర్గాల్లో 19న పోలింగ్‌ జరిగింది. దీంతో రెండో దశలో 13 రాష్ట్రాల్లోని 88 నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. కేరళ – 20, కర్ణాటక – 14, రాజస్థాన్ – 13, మహారాష్ట్ర – 8, ఉత్తరప్రదేశ్ – 8, మధ్యప్రదేశ్ – 6, బీహార్ – 5, అస్సాం – 5, పశ్చిమ బెంగాల్ – 3, ఛత్తీస్‌గఢ్ – 3, జమ్మూ కాశ్మీర్ – 1 , 12 రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతమైన త్రిపుర-1 మరియు మణిపూర్-1కి చెందిన 88 నియోజకవర్గాలకు ఈరోజు ఓటింగ్ జరుగుతోంది.

కర్ణాటక లోక్‌సభ ఎన్నికలు 2024

కర్ణాటక రాష్ట్రంలోని మొదటి దశలో 14 లోక్‌సభ నియోజక వర్గాలకు ఈరోజు (ఏప్రిల్ 26) ఓటింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో 247 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 2.88 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. మిగిలిన 14 నియోజకవర్గాలకు మే 7న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఫేజ్ 2లో బెంగుళూరు రూరల్ నుండి డికె సురేష్, బెంగుళూరు నార్త్ నుండి శోభా కరంద్లాజే, బెంగుళూరు సౌత్ నుండి తేజస్వి సూర్య, మాండ్య నుండి హెచ్ డి కుమారస్వామి పోటీ చేస్తున్న ముఖ్యమైన అభ్యర్థులు. లోక్‌సభ ఎన్నికల 2024 ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది మరియు అదే రోజు, ఫలితాలు ప్రకటించబడతాయి.

ఓటు హక్కుని వినియోగించుకున్న రాహుల్ ద్రవిడ్

క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ శుక్రవారం ఉదయం బెంగళూరులోని డాలర్స్ కాలనీ పోలింగ్ స్టేషన్‌లో నగరంలోని తొలి ఓటర్లతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు