Pooja Bhatt : తండ్రితో హీరోయిన్ రొమాన్స్… చెప్పుకోవడానికి సిగ్గుపడను అంటూ 44 ఏళ్ల వయసులో షాకింగ్ కామెంట్స్

Pooja Bhatt : ఒకప్పటి పాపులర్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ కూతురు పూజ భట్ తాజాగా తన ఆల్కహాల్ ఎడిషన్ గురించి మాట్లాడింది. తన తండ్రి దర్శకత్వంలో వచ్చిన ఫస్ట్ మూవీతోనే పాపులర్ అయిపోయిన ఈ బ్యూటీ సడన్ గా కెరీర్ డ్రాప్ అవ్వడంతో ఆల్కహాల్ కు బానిసై తాజాగా 44 ఏళ్ల వయసులో తను చెప్పుకోవడానికి సిగ్గు పడట్లేదు అంటూ పర్సనల్ లైఫ్ గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఆల్కాహాల్ అడిక్షన్…

దీపక్ తిజోరి దర్శకత్వం వహించిన ‘టిప్ప్సీ’ ట్రైలర్ లాంచ్‌కు పూజా భట్, ఆమె తండ్రి, చిత్రనిర్మాత మహేష్ భట్ హాజరయ్యారు. పూజా, దీపక్ 30 ఏళ్లుగా స్నేహితులు. ఈ మూవీ మే 10న సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లలోనే పూజ భట్ తన ఆల్కహాల్ అడిక్షన్ గురించి మాట్లాడింది. తన ఫ్రెండ్ దర్శకత్వంలో వచ్చిన టిప్సీ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పూజ మాట్లాడుతూ తాను ఎలా మందుకు బానిస అయ్యింది అనే విషయాన్ని వెల్లడించింది. ఆ మందుతో సహజీవనం చేశాక 44 ఏళ్ల వయసులో అలవాటును మానుకున్నానని, దాని గురించి ఇలా చెప్పుకోవడానికి తను సిగ్గు పడట్లేదని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. అంతేకాకుండా తనలా మరొకరు మందుకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోకూడదని చెప్తున్నాను అంటూ ఈ జనరేషన్ మహిళలు ఎలా ఆల్కహాల్ కు అలవాటు పడుతున్నారో క్లారిటీ ఇచ్చారు.

చాలా మంది మహిళలు పరిస్థితులను డీల్ చేయలేకే ఆల్కహాల్ కు అలవాటు పడుతున్నారని, కానీ దాని నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తన ఎక్స్పీరియన్స్ ను బయట పెట్టింది పూజ భట్. ఇక ప్రస్తుతం టిప్స్సీ మూవీ అలాంటి కోణంలోనే రావడం తనకు హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చింది ఈ బాలీవుడ్ బ్యూటీ.

- Advertisement -

తండ్రితో రొమాన్స్…

అప్పట్లో ఒక కవర్ పేజీ కోసం పూజ భట్ తీసుకున్న బోల్డ్ డెసిషన్ ఇండస్ట్రీని షేక్  చేసింది. ఆ కవర్ పేజీపై పూజ ఏకంగా తండ్రితో లిప్ కిస్ చేస్తూ ఫోజులిచ్చి అందరినీ నోరెళ్ళబెట్టేలా చేసింది. దీంతో ఆ ఫోటోలు బయటకు వచ్చాక తండ్రి కూతుర్ల మధ్య రొమాన్స్ ఏంటి అంటూ తీవ్రంగా విమర్శలు వెల్లువెతాయి. అయితే ఆ విమర్శలపై స్పందించిన మహేష్ భట్ ఏకంగా పూజ తన కూతురు కాకపోయి ఉంటే పెళ్లి చేసుకునే వాడిని అంటూ చెప్పి మరింతగా వివాదాన్ని రేకెత్తించారు. ఆ తర్వాత పూజ భట్ కెరీర్ నెమ్మదిగా డౌన్ అయ్యింది. ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన పూజ కెరీర్ డౌన్ అయ్యేసరికి తట్టుకోలేక ఇలా మందుకు బానిస అయ్యింది.

పూజా భట్ సినిమాలు..

పూజా భట్ అప్పట్లో స్టార్ హీరోయిన్. ఆమె 17 సంవత్సరాల వయస్సులో ‘డాడీ’ చిత్రంతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. అంగరాయ్, చాహత్, కల్లూరి వాసల్, అపరాధి, గుణేగర్, క్రాంతి క్షేత్రం, సర్, ఫిర్ తేరీ కహానీ యాద్ ఆయీ, సత్వాన్ ఆస్మాన్, సడక్ వంటి సినిమాల్లో అప్పట్లోనే స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. రీసెంట్ గా ఆమె ‘బిగ్ బాస్ OTT 2’లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు